Vastu Tips: నైరుతి దిశలో ఈ తప్పులు చేస్తున్నారా.? ఓసారి చూసుకోండి..

వాస్తు శాస్తు ప్రకారం.. నైరుతి దిశను రాహు-కేతువుల దిశగా పరిగణిస్తారు. అందుకే ఈ దిశలో కొన్ని రకాల వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటికి నైరుతి దిశలో ఆలయం లేదా పూజా గది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూదు. ఈ దిశలో పూజగృహాన్ని అస్సలు నిర్మించకూడదు...

Vastu Tips: నైరుతి దిశలో ఈ తప్పులు చేస్తున్నారా.? ఓసారి చూసుకోండి..
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 12, 2024 | 4:24 PM

హిందూ శాస్త్రంలో వాస్తుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. ఇంటి పునాది నుంచి మొదలు ఇంటి నిర్మాణం వరకు చివరికి ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువు వరకు ప్రతీ విషయంలో వాస్తు సూత్రాలను పాటిస్తుంటారు. వాస్తు పండితులు కూడా ఈ విషయంలో ఎన్నో సూచనలు చేస్తుంటారు. అలాగే ఇంట్లో ఏ దిశలో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి.? ఏ దిశలో ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయాలను వివరించారు. వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా నైరుతి దిశలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్తు ప్రకారం.. నైరుతి దిశను రాహు-కేతువుల దిశగా పరిగణిస్తారు. అందుకే ఈ దిశలో కొన్ని రకాల వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటికి నైరుతి దిశలో ఆలయం లేదా పూజా గది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూదు. ఈ దిశలో పూజగృహాన్ని అస్సలు నిర్మించకూడదు. ఈ దిక్కున ప్రతిష్టించిన దేవతామూర్తులను పూజించినా ఫలితం ఉండదని వాస్తు పండితులు చెబతున్నారు.

అంతేకాకుండా నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లో పిల్లల స్టడీ రూమ్‌ను నిర్మించుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ దిశలో మనస్సు ఏకాగ్రతగా ఉండదు, అలాగే మనస్సు ఎల్లప్పుడూ సంచరిస్తూనే ఉంటుంది. ఈ దిశలో చదువుకోవడం వల్ల పిల్లలకు ఏమీ గుర్తుండదు. కాబట్టి స్టడీ రూం ఈ దిక్కున ఉండకూడదు.

అలాగే నైరుతి దిశలో గెస్ట్‌ రూమ్‌ను కూడా నిర్మించకూడదు. వాస్తు ప్రకారం, రాహువు, కేతువుల దిశ కారణంగా, ఈ దిశలో నివసించే వ్యక్తి మనస్సు, ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. అందువల్ల ఈ దిశలో గెస్ట్‌ రూమ్‌ను నిర్మించకూడదు. అలాగే ఇంటి నైరుతి దిశలో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నిర్మించకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు పెరుగుతాయని చెబుతారు. ఇంటికి నైరుతి దిశలో మరుదొడ్లను నిర్మించకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు వాస్తు శాస్త్రంలో తెలిపిన కొన్ని విషయాలు ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..