Kids Hight Tips: వీటిని మీ పిల్లల చేత తినిపిస్తే.. హైట్ పెరగడం ఖాయం!

ఇతరుల పిల్లల కంటే తమ పిల్లలు ఎందులోనూ తక్కువ కాకూడదని ప్రతీ పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఇది చాలా సాధారణ విషయం. కానీ అలా అనుకుంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగానే మీరు కూడా వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మారుతున్న లైఫ్‌ స్టైల్ కారణంగా.. ఆహార విషయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. దీంతో వీటికి పిల్లలు బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తిని..

Kids Hight Tips: వీటిని మీ పిల్లల చేత తినిపిస్తే.. హైట్ పెరగడం ఖాయం!
Kids Hight Tips
Follow us

|

Updated on: May 25, 2024 | 4:11 PM

ఇతరుల పిల్లల కంటే తమ పిల్లలు ఎందులోనూ తక్కువ కాకూడదని ప్రతీ పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఇది చాలా సాధారణ విషయం. కానీ అలా అనుకుంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగానే మీరు కూడా వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మారుతున్న లైఫ్‌ స్టైల్ కారణంగా.. ఆహార విషయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. దీంతో వీటికి పిల్లలు బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తిని.. అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. మీ పిల్లలు హైట్‌గా, బరువుగా, తెలివిగా ఉండాలంటే.. అసలు ఆ ఫుడ్స్‌ని మీ పిల్లల చేత తినిపించకండి. అదే విధంగా పిల్లల హైట్ విషయంలో పేరెంట్స్ చాలా కంగారు పడతారు. ఎత్తు తక్కువగా ఉండే పిల్లలు.. బాగా హైట్ పెరగాలంటే.. ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. ఇవి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి.

వేలాడే ఎక్సర్‌ సైజులు:

పిల్లలు హైట్ పెరగాలంటే.. వారితో ఎక్కువగా వ్యాయామాలు చేయిస్తూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా హైట్ పెరగాలి అనుకునే పిల్లలతో వేలాడే ఎక్సర్ సైజులు చేయించండి. వేలాడే వ్యాయామాలు చేస్తే.. పిల్లలు బాగా హైట్ పెరుగుతారు. శరీర ఆకృతి కూడా చక్కగా ఉంటుంది. అలాగే స్కిప్పింగ్ కూడా హైట్ ఎదిగేందుకు హెల్ప్ చేస్తుంది.

పాలు:

పిల్లలు చక్కగా హైట్ పెరగడంలో పాలు కూడా ఎంతో సహాయ పడతాయి. ఎందుకంటే ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. క్యాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి వంటివి హైట్ పెరగడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి పిల్లలకు ప్రతీ రోజు ఒక గ్లాస్ పాలు ఖచ్చితంగా ఇవ్వండి.

ఇవి కూడా చదవండి

గుడ్లు:

గుడ్లు సంపూర్ణ పోషకాహారం. వీటిల్లో కూడా శారీరక ఎదుగుదలకు అవసరం అయ్యే పోషకాలు ఉంటాయి. ఇవి మీ పిల్లలు ఎత్తు పెరిగేందుకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్డు ఒకటి పిల్లలకు ఇవ్వండి.

మంచి నిద్ర:

పిల్లలు నిద్రలోనే ఎదుగుతారని పెద్దలు ఊరికే అనలేదు. పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా సరిపడా నిద్ర ఉండాలి. కనీసం 10 గంటల నిద్ర పిల్లలకు అవసరం. వారు చక్కగా నిద్రపోతున్నారా.. లేదా.. అనేది గమనించండి.

పండ్లు:

అన్ని రకాల పండ్లను పిల్లలకు ఇస్తూ ఉండండి. పండ్లలో అనేక రకాలైన పోషకాలు నిండి ఉంటాయి. ఇవి వారి శారీరక ఎదుగుదలకు, బలానికి తోడ్పడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్