AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిపిల్లలు రాత్రిళ్లు నిద్రపోవడం లేదా, ఈ చిట్కాలు పాటిస్తే జోల పాట పాడకుండానే నిద్రపోవడం ఖాయం..

పసి పిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డ రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేదని ఫిర్యాదు చేయడం సహజమే. ముఖ్యంగా నవజాత శిశువుల తల్లిదండ్రులు దీనిపై బాగా ఆందోళణ చెందుతుంటారు.

పసిపిల్లలు రాత్రిళ్లు నిద్రపోవడం లేదా, ఈ చిట్కాలు పాటిస్తే జోల పాట పాడకుండానే నిద్రపోవడం ఖాయం..
Baby Sleeping
Madhavi
| Edited By: |

Updated on: Mar 11, 2023 | 8:45 AM

Share

పసి పిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డ రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేదని ఫిర్యాదు చేయడం సహజమే. ముఖ్యంగా నవజాత శిశువుల తల్లిదండ్రులు దీనిపై బాగా ఆందోళణ చెందుతుంటారు. పసి పిల్లల మానసిక, శారీరక అభివృద్ధి జరగడానికి నిద్ర చాలా అవసరం. అందుకే తమ చిన్న పాప వయసుకు తగ్గట్టుగా నిద్రపోయేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చాలా సార్లు చిన్న పిల్లలు పగటిపూట ఎక్కువ నిద్రపోతారు, దీని వల్ల రాత్రి నిద్ర రాదు. దీనిని డే-నైట్ రివర్సల్ అంటారు. నవజాత శిశువుకు పగటిపూట నిద్రపోవడం. రాత్రి మెలకువ ఉండటం అలవాటు కావడంతో, తల్లిదండ్రులకు నిద్రలేక అలసి పోతుంటారు.

నవజాత శిశువు (0-3 నెలలు):

నవజాత శిశువులు రోజుకు 14 నుండి 17 గంటలు నిద్రపోతారు. ఈ వయస్సు పిల్లల స్లీపింగ్ ప్యాటర్న్ ఏంటంటే.. వారు రోజంతా ఎక్కువ సేపు నిద్రపోతారు. అలాగే రాత్రి కూడా పడుకుంటారు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలు రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదని చాలాసార్లు భావిస్తారు. అందుకని వారిని పగలు నిద్ర లేపుతుంటార. కానీ చిన్న పిల్లలు ఈ వయస్సులో ఎక్కువసేపు నిద్రపోవడం సాధారణం.

ఇవి కూడా చదవండి

3 నుండి 6 నెలల వయస్సు పిల్లలు:

3 నెలల తర్వాత, పిల్లలు సాధారణంగా నిద్రపోగలుగుతారు. ఈ వయస్సులో, పిల్లల నిద్రపోయే సమయం కూడా తగ్గుతుంది. 6 నెలల పిల్లలకు 12 నుండి 15 గంటల నిద్ర అవసరం. ఈ వయస్సులో పిల్లలు పెద్దవారిలా నిద్రపోతారు, అయితే చిన్నపాటి శబ్దం లేదా వెలుతురు పిల్లలను నిద్ర నుండి మేల్కొల్పుతుంది.

పిల్లలు రాత్రిళ్లు ఎందుకు నిద్ర లేస్తారు:

పిల్లవాడు నిద్రించే స్థలాన్ని మార్చడం. వంటివి చేస్తే పిల్లవాడు రాత్రి సమయంలో పదేపదే మేల్కొంటాడు. పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు వదులుగా ఉండే బట్టలు వేయాలా, బిగుతుగా ఉండే బట్టలు వేస్తే పిల్లల నిద్రకు భంగం కలిగిస్తాయి. ఆకలి కూడా ఒక కారణమే, ఇది పిల్లవాడిని రాత్రిపూట మళ్లీ మళ్లీ మేల్కొలపడానికి బలవంతం చేస్తుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామన్న భావన కూడా పిల్లల్లో ఉండడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.

నిద్ర లేకపోతే కలిగే నష్టాలు ఇవే:

నిద్రలో, పిల్లల శరీర కండరాలు, కణాలను సరిచేసే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. పిల్లలకి తగినంత నిద్ర రాకపోతే, శరీరం ఈ పనితీరు దెబ్బతింటుంది. బాల్యంలో నిద్ర లేకపోవడం వల్ల కౌమారదశలో మానసిక ఎదుగుదల లోపిస్తుంది. కాబట్టి నిద్రలేమి పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు.

శిశువు బాగా నిద్రపోయేలా చేయడం ఎలా:

నవజాత శిశువు రాత్రి వేళ్ల ఎన్నిసార్లు ఆహారం ఇవ్వాలి అని వైద్యుడి సలహా తీసుకోండి. పగటిపూట పిల్లవాడికి బాగా ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించండి, తద్వారా పిల్లవాడు రాత్రిపూట ఆకలితో ఉండడు. నిద్రపోయే ముందు అతనికి ఆహారం ఇవ్వండి. పగటిపూట పిల్లవాడు నిద్రపోయే సమయాన్ని సెట్ చేయండి. పగటిపూట శిశువు గదిలో వెలుతురు ఉండేలా చూడండి. రాత్రి గదిలో చీకటిగా ఉంచండి, తద్వారా శిశువు పగలు, రాత్రి మధ్య తేడాను గుర్తించగలదు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..