Instant Idli: శనగ పిండితో ఇన్స్‌స్టెంట్ ఇడ్లీలు.. దూదిలా నోట్లో కరిగిపోతాయి..

శనగ పిండితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. శనగ పిండి వల్ల వంటలకే ఎంతో రుచి వస్తుంది. శనగ పిండి కూడా ఆరోగ్యానికి మంచిదే. శనగ పిండితో చాలా మంది ఎక్కువగా స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారు. కానీ శనగ పిండితో బ్రేక్ ఫాస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. శనగ పిండి, రవ్వ కాంబినేషన‌్‌ తో ఇన్స్‌స్టెంట్ ఇడ్లీలు తయారు చేయవచ్చు. సాధారణంగా ఇడ్లీలు అంటే చాలా పని ఉంటుంది. పప్పు నానబెట్టి రుబ్బి పెట్టుకోవాలి. కానీ వీటితో ఎంతో సింపుల్‌గా టేస్టీగా త్వరగా..

Instant Idli: శనగ పిండితో ఇన్స్‌స్టెంట్ ఇడ్లీలు.. దూదిలా నోట్లో కరిగిపోతాయి..
Instant Idli
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 09, 2024 | 9:30 PM

శనగ పిండితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. శనగ పిండి వల్ల వంటలకే ఎంతో రుచి వస్తుంది. శనగ పిండి కూడా ఆరోగ్యానికి మంచిదే. శనగ పిండితో చాలా మంది ఎక్కువగా స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారు. కానీ శనగ పిండితో బ్రేక్ ఫాస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. శనగ పిండి, రవ్వ కాంబినేషన‌్‌ తో ఇన్స్‌స్టెంట్ ఇడ్లీలు తయారు చేయవచ్చు. సాధారణంగా ఇడ్లీలు అంటే చాలా పని ఉంటుంది. పప్పు నానబెట్టి రుబ్బి పెట్టుకోవాలి. కానీ వీటితో ఎంతో సింపుల్‌గా టేస్టీగా త్వరగా ఇడ్లీలు రెడీ అవుతాయి. ఇవి ఎంతో స్మూత్‌గా దూదిలా ఉంటాయి. నోట్లో పెట్టగానే కరిగిపోతాయి. మరి శనగ పిండి, రవ్వ ఇడ్లీలు ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శనగ పిండి – రవ్వ ఇడ్లీలకి కావాల్సిన పదార్థాలు:

శనగ పిండి, రవ్వ, పెరుగు, ఫ్రూట్ సాల్ట్, పసుపు, నిమ్మరసం, ఉప్పు, పంచదార పొడి, ఆవాలు, కరివేపాకు, పచ్చి మిర్చి, కొత్తి మీర, నెయ్యి లేదా నూనె.

శనగ పిండి – రవ్వ ఇడ్లీలు తయారీ విధానం:

ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో శనగ పిండి, రవ్వ, పెరుగు అన్నీ ఒకే కొలతలో తీసుకోండి. ఇందులో పసుపు, నిమ్మరసం, ఉప్పు, పంచదార పొడి వేసి కలపండి. కొద్దిగా నీళ్లు పోసి.. ఇడ్లీ క్వాంటిటీలో కలపండి. ఇప్పుడు ఈ పిండిని ఓ పావు గంట సేపు పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నూనె, ఫ్రూట్ సాల్ట్ వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని ప్లేట్స్‌కి నెయ్యి లేదా నూనె రాయండి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మీకు కావాల్సినన్ని ఇడ్లీలు వేసుకుని మీడియం మంటపై ఇడ్లీలను ఉడికించండి. ఈలోపు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి, కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. ఇడ్లీలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని దానిపై తాళింపు చల్లుకుని టమాటా చట్నీతో తింటే.. ఆహా టేస్ట్ వేరే లెవల్ అంతే. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.