జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వెండి ఉంగరాలు, ఇతర ఆభరణాలు ధరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెండి రేటు తక్కువ కావొచ్చు కానీ.. ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మెట్టెల నుంచి ఉంగరాల వరకు వెండి ఆభరణాలను పెట్టుకోవడం ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.
వెండి రేటు తక్కువ కావొచ్చు కానీ.. ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మెట్టెల నుంచి ఉంగరాల వరకు వెండి ఆభరణాలను పెట్టుకోవడం ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.
వెండి ఉంగరాలను పెట్టుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మనం పెట్టుకున్న వెండి ఉంగరాలు ఎంత నల్లబడితే అంత వేడిని మన శరీరంలో తగ్గిస్తుంది.
వెండి ఉంగరాలు లేదా పట్టీలు లేదా చైన్ ను ధరిస్తే.. కొన్ని రోజులకు అది కొంచెం నల్లబడుతుంది. నిపుణుల ప్రకారం.. మన శరీర వేడిని తగ్గించడం వల్లే ఇలా వెండి నల్లగా మారుతుంది.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. అలాంటివారికి వెండి మేలు మంచిది.
వెండి ఉంగరాన్ని క్రమం తప్పకుండా ధరించడం వల్ల మీ శరీర రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు.
అయితే వాస్తు ప్రకారం.. చిటికెన వేలికి వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అలాగే పనితీరు కూడా మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.