షుగర్‌ పేషెంట్స్‌.. డ్రాగన్‌ ఫ్రూట్ తినొచ్చా..  

Narender Vaitla

22 October 2024

తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా డ్రాగ్‌ ఫ్రూట్స్‌ ఉపయోగాపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో డ్రాగన్‌ సహాయపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. మలబద్దకంతో పాటు కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

డ్రాగన్ ఫ్రూట్‌ మెగ్నీషియంకు పెట్టింది పేరు. ఇది రక్తకపోటును కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడుతుంది. బీపీతో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతుంది.

షుగర్‌ పేషెంట్స్‌ కూడా డ్రాగన్‌ ఫ్రూట్స్‌ ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ డయాబెటిస్‌ రోగులకు ఎంతో మేలు చేస్తుంది.

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో డ్రాగన్ ఫ్రూట్‌ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిస్‌ సి చర్మానికి కాంతిని అందిస్తుంది.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో డ్రాగన్‌ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. ఇందులోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.