AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blue Beery vs Amla: బ్లూ బెర్రీ vs ఉసిరి.. ఈ రెండింటిలో ఏది చర్మానికి మంచిది..

బ్లూ బెర్రీ, ఉసిరి రెండింటి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. బ్లూ బెర్రీలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరి గురించి అసలు పరిచయాలే అవసరం లేదు. ఈ రెండింటిలో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కేవలం ఆరోగ్యానికే కాకుండా అందాన్ని పెంచడంలో కూడా ఎంతో బాగా యూజ్ అవుతాయి. బ్లూ బెర్రీ, ఉసిరి.. వీటిల్లో ఏదో ఒకటి తరచూ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మ అందాన్ని పెంచడంలో ఇవి ఎంతో చక్కగా పిన చేస్తాయి. వయసు పెరిగా కూడా ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే..

Blue Beery vs Amla: బ్లూ బెర్రీ vs ఉసిరి.. ఈ రెండింటిలో ఏది చర్మానికి మంచిది..
Blueberry Vs Amla
Chinni Enni
|

Updated on: Oct 22, 2024 | 3:42 PM

Share

బ్లూ బెర్రీ, ఉసిరి రెండింటి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. బ్లూ బెర్రీలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరి గురించి అసలు పరిచయాలే అవసరం లేదు. ఈ రెండింటిలో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కేవలం ఆరోగ్యానికే కాకుండా అందాన్ని పెంచడంలో కూడా ఎంతో బాగా యూజ్ అవుతాయి. బ్లూ బెర్రీ, ఉసిరి.. వీటిల్లో ఏదో ఒకటి తరచూ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మ అందాన్ని పెంచడంలో ఇవి ఎంతో చక్కగా పిన చేస్తాయి. వయసు పెరిగా కూడా ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే పండ్లు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. చర్మ ఆరోగ్యాన్ని పెంచడంలో ఉసిరి, బ్లూ బెర్రీ ముందు ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఏది ఎక్కువగా చర్మానికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లూ బెర్రీ:

బ్లూ బెర్రీలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి చూడటానికి ద్రాక్ష పండ్లలా కనిపిస్తాయి. కానీ ఇవి కాస్త గట్టిగా ఉంటాయి. రుచి కూడా బాగానే ఉంటాయి. ఇందులో ఎక్కువగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. చర్మాన్ని అందంగా ఉంచడంలో ఇవి ఎంతో చక్కగా సహాయ పడతాయి. అలాగే వీటిల్లో ఉండే విటమిన్ కె.. కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో వయసు ఎంత ఉన్నా కూడా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. చర్మంపై ముడతలు, మచ్చలు, గీతలు ఏర్పడవు. ఉన్నవాటిని కూడా తగ్గిస్తాయి. నల్ల మచ్చలను కూడా కంట్రోల్ చేస్తాయి. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. తరచూ తీసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.

ఉసిరి:

ఉసిరి అనేది ఎంతో ప్రాచీన కాలం నుంచి ఉపయోగంలో ఉంది. ఆయుర్వేదంలో కూడా పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉసిరిని ఉపయోగించే వారు. ఉసిరిలో కూడా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయ పడతాయి. ఉసిరి తిన్నా, ఉసిరి రసం తాగినా ఎలాంటి చర్మ ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గుతాయి. మళ్లీ త్వరగా రాకుండా ఉంటాయి. చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరి పొడిని చాలా మంచి ఫేస్ ప్యాక్‌గా వేసుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఏది మంచిది..

చర్మానికి బ్లూ బెర్రీ, ఉసిరి రెండూ మంచివే. రెండూ చర్మాన్ని ఎంతో అందంగా మార్చుతాయి. అయితే మీ చర్మ తత్వాన్ని బట్టి మీరు ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే అందరికీ అన్నీ పడవు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వెండి ధర భారీగా పడిపోనుందా..?
వెండి ధర భారీగా పడిపోనుందా..?
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా