Chayote Benefits: గ్రామాల్లో దొరికే సీమ వంకాయ కనిపిస్తే వదలకుండా తినండి.. నమ్మలేని లాభాలు!
కూరగాయల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో మనం ఎక్కువగా తినేవి వంకాయలు. వంకాయలు అంటే చాలా మందికి ఇష్టం. వీటితో ఎర్రీ చేసినా.. బజ్జీలు చేసినా ఎంతో రుచిగా ఉంటాయి. వెజిటేబుల్స్‌లో రాజు ఎవరంటే వంకాయ అనే అంటారు. ఈ వంకాయల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. వీటిల్లో నచ్చినవి తెచ్చుకుని తింటూ ఉంటారు. అలా వీటిల్లో సీమ వంకాయ కూడా ఒకటి. చాలా మందికి ఈ వంకాయ గురించి పెద్దగా తెలియక పోవచ్చు. ఇవి ఎక్కువగా గ్రామాల్లో లభిస్తాయి. చూడటానికి..
కూరగాయల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో మనం ఎక్కువగా తినేవి వంకాయలు. వంకాయలు అంటే చాలా మందికి ఇష్టం. వీటితో ఎర్రీ చేసినా.. బజ్జీలు చేసినా ఎంతో రుచిగా ఉంటాయి. వెజిటేబుల్స్‌లో రాజు ఎవరంటే వంకాయ అనే అంటారు. ఈ వంకాయల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. వీటిల్లో నచ్చినవి తెచ్చుకుని తింటూ ఉంటారు. అలా వీటిల్లో సీమ వంకాయ కూడా ఒకటి. చాలా మందికి ఈ వంకాయ గురించి పెద్దగా తెలియక పోవచ్చు. ఇవి ఎక్కువగా గ్రామాల్లో లభిస్తాయి. చూడటానికి తెల్ల వంకాయలా ఉంటుంది. కానీ ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ మధ్య సిటీలకు కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఈ సీమ వంకాయలతో కర్రీ చేశారంటే అస్సలు మర్చిపోరు. అంత రుచిగా ఉంటుంది. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
షుగర్ లెవల్స్ కంట్రోల్:
ప్రస్తుత కాలంలో చాలా మంది షుగర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఇలాంటి ఈ సీమ వంకాయలు తినడం వల్ల చాలా మంచిది. ఈ వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్.. రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించి అదుపు చేస్తుంది. కాబట్టి డయాబెటీస్‌ను కంట్రోల్ చేయవచ్చు.
అందం పెరుగుతుంది:
సీమ వంకాయలు తినడం వల్ల అందం కూడా పెరుగుతుంది. చర్మ, జుట్టు సమస్యలు అదుపులోకి వస్తాయి. ఈ వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను, విష పదార్థాలను బయటకు పంపుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. వంకాయలో ఉండే పోషకాలు జుట్టును బలంగా ఉంచేలా చేస్తుంది.
ఊబకాయానికి చెక్:
సీమ వంకాయ తినడం వల్ల ఊబకాయం కూడా అదుపులోకి వస్తుంది. ఊబకాయంతో బాధ పడేవారు సీమ వంకాయను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇందులో పీచు పదార్థాలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా.. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక బరువు, ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.
గర్భిణీలకు మంచిది:
గర్భిణీలు సీమ వంకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫోలేట్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా ఇది చాలా అవసరం. కాబట్టి మీ ఆహారంలో సీమ వంకాయ చేర్చుకుంటే.. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు.
గుండె ఆరోగ్యం:
గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కూడా సీమ వంకాయ చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, పీచు పదార్థాలు గుండె పనితీరుకు అడ్డంగా ఉన్న వాటిని తొలగిస్తాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా అదుపు చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..