- Telugu News Photo Gallery Are you looking to get shiny hair like silk, then use rice water without draining it in this way
పట్టులాంటి మెరిసే జుట్టు కావాలంటే.. ఈ నీటిని పారబోయకుండా వాడేయండి..! రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు..
జుట్టు సమస్యలను నివారించేందుకు కెమికల్ ఆధారిత చికిత్సలతో లాభం కంటే, నష్టాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, కొన్ని ఇంటి చిట్కాలతో జుట్టు సమస్యలను ఇట్టే దూరం చేసుకోవచ్చునని చెబుతున్నారు. అలాంటి ఇంటి చిట్కాలలో జుట్టు సమస్యలకు బియ్యం నీరు చక్కటి పరిష్కారం అంటున్నారు. దీంతో మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా నిగనిగలాడుతూ పెరుగుతుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Oct 22, 2024 | 1:51 PM

Rice Water

కాబట్టి ఈ నీటిని ఉపయోగించడం వల్ల చర్మం సైతం మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. చర్మవ్యాధి, మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో బియ్యం కడిగిన నీరు సహాయపడుతుంది. ఇది చర్మంపై నల్ల మచ్చలు, మంట, వాపును నయం చేయడంలో సహాయపడుతుంది.

ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. అందువల్ల ఇది అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో, యవ్వనాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. ఈ నీటిని ముఖానికి పట్టించడం వల్ల చర్మంపై ముడతలు సైతం తగ్గుతాయి. ఇది చర్మానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా పోషణను అందిస్తుంది.

బియ్యం నీటిలో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బియ్యం నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా, సిల్కీగా తయారవుతుంది. బియ్యం నీరు చుండ్రును కూడా తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. బియ్యం నీటిలో పొటాషియం, అయోడిన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, మాంగనీస్, ఎక్కువ ఫైబర్ ఉంటాయి.

బియ్యం నీటిని క్రమం తప్పకుండా మీ జుట్టుకు అప్లై చేయటం వల్ల స్ప్లిట్ ఎండ్స్ ను తగ్గిస్తుంది. బియ్యం నీరులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా సిల్కీగా కూడా చేస్తుంది. కాబట్టి జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు కూడా దీనిని ఉపయోగించవచ్చు.

ఒక్క బియ్యం నీటితో అటు మీ చర్మాన్ని, ఇటు మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి బియ్యం నీటిని రెగ్యులర్ గా ఉపయోగించండి. బియ్యం నీరు ముఖ రంధ్రాలను తగ్గించి మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఈ బియ్యం నీటిని క్రమం తప్పకుండా వాడితే ప్రకాశవంతమైన, మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. మొటిమల నివారణకు కూడా బియ్యపు నీటిని వాడవచ్చు.




