బరువు తగ్గాలంటే ఈ వెరైటీ ఇడ్లీలను ట్రై చేయండి.. 

22 October 2024

TV9 Telugu

Pic credit - Getty

దక్షిణ భారత దేశంలో ఇష్టమైన అల్పాహారంగా ప్రసిద్ది చెందింది ఇడ్లీ. తెల్లని మల్లెపువ్వులా, మెత్తగా ఉండే ఈ ఇడ్లీను వేడివేడిగా చట్నీతో కలిపి తింటే దాని రుచి వేరు.

సర్వ సాధారణంగా మినప పప్పు, బియ్యం రవ్వతో చేసిన ఇడ్లీని తింటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఈ ఐదు వెరైటీ ఇడ్లీ వంటకాలను తినడం మంచిది. 

ఓట్స్ ఇడ్లీలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఇడ్లీలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

బీట్‌రూట్‌లో వివిధ పోషకాలు ఉన్నాయి, అందువల్ల బరువు తగ్గడానికి బీట్‌రూట్ ఇడ్లీ కూడా మంచి ఎంపిక.

ఫైబర్ అధికంగా ఉండే మొలకలు పిండితో ఇడ్లీని తయారు చేస్తారు. బరువు తగ్గడానికి ఈ స్ప్రౌట్స్ ఇడ్లీని ప్రయత్నించండి.

క్యారెట్ ఇడ్లీలో కేలరీలు తక్కువగా.. పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ ఇడ్లీని తర్వాత కొవ్వు పదార్ధాలు తీసుకోకుండా ఉంటారు.

సొరకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఇడ్లీ ఆరోగ్యకరమైనది. బరువు తగ్గడానికి గొప్ప ఆహారం సొరకాయ ఇడ్లీ..