AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laziness: సోమరితనం, బద్ధకంతో ఉంటే అనర్థమే.. ఈ చిట్కాలతో సింపుల్‌గా బయటపడండి..

ఒక్కోసారి అన్నీ తెలిసి కూడా మనం ఏమీ చేయకుండా ఉంటాం. ఎక్కువ నిద్రపోవడం వల్ల హాని జరుగుతుందని మనకు తెలుసు, మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదనీ తెలుసు.

Laziness: సోమరితనం, బద్ధకంతో ఉంటే అనర్థమే.. ఈ చిట్కాలతో సింపుల్‌గా బయటపడండి..
Laziness
Shaik Madar Saheb
|

Updated on: Sep 13, 2022 | 7:52 PM

Share

Get Rid Of Laziness: జీవితంలో మంచి కెరీర్, విజయాలను ఎవరు కోరుకోరు. చాలామంది ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకెళ్తారు.. కానీ కొన్ని కొన్ని విషయాలు అలాంటి వారిని మధ్యలోనే ఆపేస్తాయి. అలాంటి వారిలో సోమరితనం అతిపెద్ద అడ్డంకిగా మారుతుంది. ఒక్కోసారి అన్నీ తెలిసి కూడా మనం ఏమీ చేయకుండా ఉంటాం. ఎక్కువ నిద్రపోవడం వల్ల హాని జరుగుతుందని మనకు తెలుసు, మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదనీ తెలుసు. కానీ మనం వాటిని ఏమాత్రం పట్టించుకోం. సోమరితనం, బద్దకం లాంటి విషయాలు ఎలాంటి పనిని చేయనియ్యవు. బద్ధకం వల్ల చాలా సార్లు మనం పెద్ద నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. సోమరితనం నుంచి ఎలా బయటపడాలి.. దాని కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సోమరితనం ఎందుకు వస్తుంది?

వ్యాధి మనకు తెలిసే వరకు దానిని నయం చేయడం కష్టం. బద్ధకం రావడానికి కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ముందుగా ఆ కారణం ఏంటో కనుక్కోండి. సోమరితనానికి ప్రధాన కారణం నిద్ర, అనోరెక్సియా. మనకు ఏ పనిపైనా ఆసక్తి లేకుంటే సోమరితనం తప్పదు, కానీ దాన్ని అధిగమించడం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

శుభ్రంగా ఉండండి.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి..

దుర్భరం, మురికి నుంచి సోమరితనం మొదలవుతుంది. మన పని స్థలం లేదా ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటే ఏకాగ్రత పోతుంది. అప్పుడు సోమరితనం వస్తుంది. సోమరితనాన్ని తొలగించడానికి మొదట మీ ఇంటిని మీరే బాగుచేసుకోండి.. 4-5 రోజులు మురికిలో ఉంటే మీరు మరింత సోమరితనం బారిన పడతారు.

టైమ్ టేబుల్ తయారు చేసుకోండి..

సమయానికి సిద్ధంగా ఉండాలంటే టైం సాయం తీసుకుంటాం. దీని ద్వారా ఏదైనా పనిని త్వరగా చేయడం, సమయానికి చేయడం చేస్తాం. ఈ విధంగా టైం ఎంత గడిచిపోతుందో తెలియదు. అందువల్ల ప్రతిదీ నిర్ణిత సమయంలో పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి. దీంతోపాటు నిర్ణీత సమయంలోనే విశ్రాంతి తీసుకోవాలి.

మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి..

మనస్సు లోపల నుంచి సిద్ధపడకపోతే, మన సోమరితనాన్ని ఎవరూ తొలగించలేరు. దీని కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. సోమరితనం హాని కలిగిస్తుందని ఎల్లప్పుడూ మీకు మీరు వివరిస్తూ ఉండాలి. లక్ష్యాలను గుర్తుంచుకుని ఇతరుల శ్రమను గుర్తిస్తే సోమరితనం దూరమవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం..