AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Strainer clean : టీ జాలి జిడ్డుగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా క్లీన్ అవుతుందట..

మార్కెట్‌లో రెండు రకాల టీ స్ట్రైనర్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ప్లాస్టిక్, మరొకటి స్టీల్‌. కానీ ప్లాస్టిక్ స్ట్రైనర్లు కొంచెం చౌకగా ఉంటాయి. అయితే వాటిని ఉపయోగించటం ఆరోగ్యానికి హానికరం. బదులుగా స్టీల్ స్ట్రైనర్ ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీ శరీరానికి తక్కువ హాని కలిగిస్తుంది. అంతేకాకుండా, స్టీల్ స్ట్రైనర్ చాలా కాలం పాటు ఉపయోగించవచ్చు. శుభ్రం చేయడం కూడా చాలా సులభం. మరోవైపు, ప్లాస్టిక్ స్ట్రైనర్ ద్వారా వడకట్టిన టీని రోజు తాగడం వల్ల క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉంది.

Tea Strainer clean : టీ జాలి జిడ్డుగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా క్లీన్ అవుతుందట..
Tea Strainer Clean
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2024 | 4:56 PM

Share

వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే… కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం వంటగదిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, అది శుభ్రంగా లేకపోతే, వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. వంటగదిలోని వస్తువులను శుభ్రం చేయడం సమస్య కాదు. కానీ, టీ స్ట్రైనర్‌ను శుభ్రంగా ఉంచడం చాలా మంది గృహిణులకు పెద్ద తలనొప్పిని కలిగిస్తుంది. కొన్నిసార్లు టీ పౌడర్‌ దాని లోపల పేరుకుపోతుంది. దీంతో టీ వడకట్టాలంటే ఇబ్బందికరంగా మారుతుంది. మూసుకుపోయిన టీ జాలి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బ్యాక్టీరియా, జెర్మ్స్‌కి కారణమవుతుంది. టీ రుచి కూడా మారుతుంది. అందుకే టీ స్ట్రైనర్స్‌ని రెగ్యులర్‌గా క్లీన్ చేయడం మంచిది. కాబట్టి, టీ ఫిల్టర్‌ శుభ్రం చేయటానికి కొన్ని సులువైన చిట్కాలు ఉన్నాయి. వాటితో మీరు మీ టీ స్ట్రైనర్‌ను కొత్తదానిలా మార్చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

ఒక గిన్నెలో తగినంత వేడి నీటిని తీసుకోండి. టీ ఫిల్టర్‌ తీసుకుని ఆ వేడినీటిలో కొన్ని నిమిషాలపాటు నానబెట్టండి. ఇప్పుడు దాన్ని బయటకు తీసి నీటిని పారబోయండి. ఇప్పుడు స్పాంజ్‌పై డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో స్ట్రైనర్‌ను సున్నితంగా రుద్దండి. ఆ తరువాత నీటితో కడిగితే చాలు.. మీ టీ ఫిల్టర్ శుభ్రంగా, కొత్తదానిలా మెరస్తూ కనిపిస్తుంది.

బేకింగ్ సోడా కూడా టీ స్ట్రైనర్‌ క్లీనర్‌ చేయటానికి ఉపయోగించవచ్చు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బేకింగ్‌ సోడాతో ప్లాస్టిక్, స్టీల్ స్ట్రైనర్లు రెండూ శుభ్రం చేయొచ్చు. దీనికోసం ఓ చిన్న గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను 4, 5 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీటిని పోసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఓ పెద్ద గిన్నెలో పోయాలి. దీనిలో కొన్ని గంటల పాటు స్ట్రైనర్‌ని ఉంచి. ఆ తర్వాత స్ట్రైనర్‌ని పాత టూత్ బ్రష్‌తో క్లీన్ చేయండి. ఇప్పుడు నీటితో కడిగేయాలి.

ఇవి కూడా చదవండి

బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా టీ స్ట్రైనర్‌లను బాగా శుభ్రపరుస్తుంది. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ బ్లీచింగ్‌ పౌడర్‌ తీసుకుని అందులో 1 కప్పు చల్లని నీరు కలపండి. ఇప్పుడు మీ స్టయినర్‌ని ఆ మిశ్రమంలో కొన్ని గంటల పాటు నానబెట్టండి. తర్వాత దాన్ని బయటకు తీసి టూత్ బ్రష్‌తో నెమ్మదిగా స్క్రబ్ చేయండి. ఇలా చేస్తే చిటికెలో మీ టీ ఫిల్టర్‌ మెరుస్తూ కనిపిస్తుంది.

టీ స్ట్రైనర్‌ని క్లీన్ చేయడం కోసం.. టీ నెట్‌ని సన్నని మంటతో గ్యాస్‌ బర్నర్‌పై పెట్టొచ్చు. ఇలా చేస్తే టీ జాలికి అంటుకుని ఉన్న పాలు, టీ వంటి పదార్థాలు కాలిపోతాయి. ఇలా ఓసారి క్లీన్‌ చేశాక మీ రెగ్యులర్ డిష్‌వాషింగ్‌తో క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అవుతుంది. ఇలాంటి కొన్ని టిప్స్ పాటించడం వల్ల సమస్య చాలా వరకూ దూరమవుతుంది.

ఇకపోతే, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మార్కెట్‌లో రెండు రకాల టీ స్ట్రైనర్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ప్లాస్టిక్, మరొకటి స్టీల్‌. కానీ ప్లాస్టిక్ స్ట్రైనర్లు కొంచెం చౌకగా ఉంటాయి. అయితే వాటిని ఉపయోగించటం ఆరోగ్యానికి హానికరం. బదులుగా స్టీల్ స్ట్రైనర్ ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీ శరీరానికి తక్కువ హాని కలిగిస్తుంది. అంతేకాకుండా, స్టీల్ స్ట్రైనర్ చాలా కాలం పాటు ఉపయోగించవచ్చు. శుభ్రం చేయడం కూడా చాలా సులభం. మరోవైపు, ప్లాస్టిక్ స్ట్రైనర్ ద్వారా వడకట్టిన టీని రోజు తాగడం వల్ల క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us