AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాబేజీతో ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు తెలుసా?

ఫైబర్‌ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా మీ దరిచేరదు. శరీరంలో మంట వాపు సమస్యలకు కూడా క్యాబేజీ చెక్ పెడుతుంది. దీంతో కేన్సర్‌, గుండె సమస్యలు, డయాబెటీస్‌, అల్జీమర్స్‌తో బాధపడేవారికి ఎంతో ఆరోగ్యం.

క్యాబేజీతో ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు తెలుసా?
Cabbage
Jyothi Gadda
|

Updated on: Jul 16, 2024 | 10:02 PM

Share

క్యాబేజీలో రోగనిరోధక శక్తి పెంచే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు. షుగర్, థైరాయిడ్ సమస్యలను సైతం క్యాబేజీ సమర్థంగా ఎదుర్కొంటుందని అంటున్నారు. క్యాబేజీలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మనకు రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్‌ అందిస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి మంచిది. దీన్ని పచ్చిగా సలాడ్‌, సూప్స్ వంటివి కూడా చేసుకుని తినొచ్చు. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు క్యాబేజీలో ఫైబర్, విటమిన్ కే, సీ కూడా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రాణాంతక గుండె, క్యాన్సర్‌ సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది. క్యాబేజీలో యాంటీహైపర్‌గ్లైసెమిక్‌ గుణం కలిగి ఉంటుంది. ఇది మధుమేహం బాధితులకు మంచిది. డయాబెటిస్‌ నెఫ్రోపతి నుంచి కాపాడుతుంది. ఇది రక్తంలో చక్కెరస్థాయిలను నిర్వహిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

షుగర్‌ వ్యాధి గ్రస్థులు తప్పనిసరిగా వారి డైట్లో క్యాబేజీని చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీలో గ్లూకోసైనోలేట్స్‌, సల్ఫర్‌ ఉంటుంది. అంతేకాదు క్యాబేజీలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కేన్సర్‌ ను నివారిస్తుంది అని వెబ్‌ ఎండీ తెలిపింది. క్యాన్సర్‌ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. క్యాబేజీలో ఆంథోసైనిన్స్‌ ఉంటాయి. ఆర్థ్రరైటీస్‌ సమస్యలకు చెక్‌ పెడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు బీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది. ముఖ్యంగా క్యాబేజీ మహిళలకు వరం కంటే తక్కువ కాదు అని ఎన్‌ ఐ హెచ్ నివేదిక తెలిపింది

ఫైబర్‌ పుష్కలంగా ఉండే క్యాబేజీ చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.ఇది కడుపు అల్సర్‌ రాకుండా చేస్తుంది. క్యాబేజీని డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీర పనితీరు కూడా మెరుగవుతుంది. ఫైబర్‌ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా మీ దరిచేరదు. శరీరంలో మంట వాపు సమస్యలకు కూడా క్యాబేజీ చెక్ పెడుతుంది. దీంతో కేన్సర్‌, గుండె సమస్యలు, డయాబెటీస్‌, అల్జీమర్స్‌తో బాధపడేవారికి ఎంతో ఆరోగ్యం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?