అరటి ఆకుల్లో భోజనం ఆరోగ్యం, అందం రెట్టింపు.. ఇలా వాడితే తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..

అరటి ఆకుల్లో ఆహారం తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు చేస్తుంది. సాధారణంగా చర్మంపై అల్సర్లు, మొటిమలు, మచ్చలు కనిపించవచ్చు. అలాంటప్పుడు అరటి ఆకుపై కొబ్బరి నూనె రాయండి. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

అరటి ఆకుల్లో భోజనం ఆరోగ్యం, అందం రెట్టింపు.. ఇలా వాడితే తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..
Banana Leaves
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 16, 2024 | 9:22 PM

అరటి ఆకులో తినడం వల్ల ఆహారం రుచి, వాసన పెరుగుతుంది. అరటి ఆకు వంటకు మనకు తెలియని సూక్ష్మమైన రుచిని ఇస్తుంది. ముఖ్యంగా అరటి ఆకులలో కొన్ని యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను నిండివున్నాయి. సహజ యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆహారంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అరటి ఆకులో తినే ఆహారం అనేక అనారోగ్యాలను దరి చేరకుండా చేస్తుంది. అరటి ఆకుల్లో భోజనం చేయటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాలలో కొన్ని ఆహారంలోకి బదిలీ అవుతాయి. దాని పోషక విలువను మెరుగుపరుస్తాయి. అరటి ఆకులు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా సులభంగా భూమిలో కలిసిపోతాయి. అంతేకాదు.. మిగిలిపోయిన ఆహారాన్ని అరటి ఆకులో చుట్టి నిల్వచేయటం వల్ల పాడవకుండా ఉంటుంది.. అంతేకాదు.. అరటి ఆకులో తినడం జుట్టుకు కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అరటి ఆకుల్లో తరచూ భోజనం చేసేవారిలో తెల్ల జుట్టు సమస్య దూరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అరటి ఆకుల్లో బోజనం చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే అరటి ఆకుల్లో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు అధకంగా ఉంటాయి. వీటిపై భోజనం చేస్తే ఎలాంటి క్రిములు ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరవు. అందువల్లే అరటి ఆకులో భోజనం చేయడమే మేలని పెద్దలు చెబుతారు. అరటి ఆకు కాలిన గాయాల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది. అరటి ఆకుపై అల్లం నూనెను చిలకరించి, శరీరం కాలిన భాగంలో పై నుండి క్రిందికి చుట్టండి. ఇది వేడి, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే అరటి ఆకుల్లో ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్, ఇజిసిజి వంటి పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

అరటి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది. అలాగే రాత్రిపూట అంధత్వం వంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అరటి ఆకుల్లో ఆహారం తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు చేస్తుంది. సాధారణంగా చర్మంపై అల్సర్లు, మొటిమలు, మచ్చలు కనిపించవచ్చు. అలాంటప్పుడు అరటి ఆకుపై కొబ్బరి నూనె రాయండి. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..