నార్సింగి డ్రగ్స్ కేసులో బడా పారిశ్రామిక వేత్తలు.. వెలుగులోకి మరిన్ని షాకింగ్‌ విషయాలు..!

అమన్‌తో పాటు పాజిటివ్‌ వచ్చినవారికి నోటీసులిచ్చామని చెప్పారు. అమన్‌ను హైదరాబాద్‌లోనే పట్టుకున్నామని, పాజిటివ్‌ వచ్చినవారిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, DPS 27 ప్రకారం కన్జుమర్లు కూడా నిందితులని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

నార్సింగి డ్రగ్స్ కేసులో బడా పారిశ్రామిక వేత్తలు.. వెలుగులోకి మరిన్ని షాకింగ్‌ విషయాలు..!
Narsingi Drugs Case
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 16, 2024 | 10:15 PM

డ్రగ్స్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. రోజు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. డ్రగ్స్ సేవిస్తున్న బడా పారిశ్రామిక వేత్తలను గుర్తించారు పోలీసులు. ఏడు పబ్‌లకు యజమానిగా ఉన్న నిఖిల్‌ ధావన్‌, సిస్టల్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ యజమాని మధురాజుతోపాటు మరో ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల యజమానులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. కేసులో A14గా హీరోయిన్.. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌సింగ్‌ని చేర్చారు. ఈ మేరకు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ…. కన్జుమర్లను చార్జ్‌షీట్‌లో పెడతామన్నారు. మరోసారి నిందితుల శాంపిల్స్‌ తీసుకున్నామని చెప్పారు.

అమన్‌తో పాటు పాజిటివ్‌ వచ్చినవారికి నోటీసులిచ్చామని చెప్పారు. అమన్‌ను హైదరాబాద్‌లోనే పట్టుకున్నామని, పాజిటివ్‌ వచ్చినవారిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, DPS 27 ప్రకారం కన్జుమర్లు కూడా నిందితులని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

రాజేంద్రనగర్ డివిజన్‌లో నార్కొటిక్ బ్యూరో, ఎస్‌వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌‌లో దాదాపు 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. ఈకేసులో ఐదుగురు నిందితులను డ్రగ్స్ పెడ్లర్లుగా తేల్చారు నార్సింగి పోలీసులు. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం.. ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. పట్టుబడ్డ ఐదుగురు నిందితులకు 14రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు.

ఇవి కూడా చదవండి

అయితే డ్రగ్స్ కేసులో A1గా నైజీరియన్ మహిళ అనోహా బ్లెస్సింగ్ గా గుర్తించిన పోలీసులు.. మొత్తం 18 మందిపై కేసు నమోదుచేశారు. వీరిపై సెక్షన్ 22(C), 27(A)తో పాటు .. Ndpc యాక్ట్ 27 కింద కేసు నమోదు చేశారు. ఇక డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎబుకా సుజి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌