ఆన్‌లైన్లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తున్నారా.! ఇలాంటి కాల్స్ కన్ఫాం..

ఉన్న ఊరును, కన్నవారిని వదిలేసి నగరంలో ఉద్యోగం కోసం నిరుద్యోగులు అవస్థలు అసాధారణంగా ఉంటాయి. ఇలాంటి నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. తమ విలాసవంతమైన జీవితం కోసం నిరుద్యోగులను బజారుకి ఈడుస్తున్నారు. బ్యాక్ డోర్‎లో అయినా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలని ఆశతో ఎంతోమంది యువత ముందు వెనుక ఆలోచించకుండా లక్షలు ఖర్చుచేస్తున్నారు.

ఆన్‌లైన్లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తున్నారా.! ఇలాంటి కాల్స్ కన్ఫాం..
Hyderabad
Follow us
Vijay Saatha

| Edited By: Srikar T

Updated on: Jul 16, 2024 | 11:45 PM

ఉన్న ఊరును, కన్నవారిని వదిలేసి నగరంలో ఉద్యోగం కోసం నిరుద్యోగులు అవస్థలు అసాధారణంగా ఉంటాయి. ఇలాంటి నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. తమ విలాసవంతమైన జీవితం కోసం నిరుద్యోగులను బజారుకి ఈడుస్తున్నారు. బ్యాక్ డోర్‎లో అయినా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలని ఆశతో ఎంతోమంది యువత ముందు వెనుక ఆలోచించకుండా లక్షలు ఖర్చుచేస్తున్నారు. తీరా అక్కడ ఎలాంటి కంపెనీ లేదని తెలుసుకొని మోసపోయామని గ్రహించి కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఇటీవల కాలంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ సెక్టర్లో ఇలాంటి కంపెనీలు పదుల సంఖ్యలో వెలిశాయి. కంపెనీ అడ్రస్, పేరు, కంపెనీ వెబ్సైట్ ఉంటుంది. కానీ కంపెనీ మాత్రం ఉండదు. ఈ చేదు నిజం తెలియక జాబ్ వచ్చిందని తెలియగానే కోటి ఆశలతో ఉద్యోగం సంపాదించామని తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్న యువతకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆన్లైన్‎లో రెస్యూమ్‎లు అప్లోడ్ చేసి గంటకు పదిసార్లు మెయిల్స్ చెక్ చేసుకుంటున్న యువతను కొంతమంది కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. నకిలీ జాబ్ ఆఫర్ల పేరుతో నిరుద్యోగుల నుండి అందిన కాడికి దోచుకుని ఫేక్ ఆఫర్ లెటర్లు ఇస్తూ నిండా ముంచేస్తున్నారు.

మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న రెస్యూమ్‎లను వివిధ మార్గాల ద్వారా డౌన్లోడ్ చేసుకుంటున్న కేటుగాళ్ళు బాధితులకు ఫోన్లు చేసి తమ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అందుకు కొంత ఖర్చు అవుతుందని డిమాండ్ చేస్తున్నారు. ఇలా అధిక ఆదాయం సంపాధించే ఉద్యోగాలంటూ ఆశ చూపుతున్నారు. ఎరిక్స్న్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‎లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ నమ్మించి లింక్డ్ ఇన్, నౌకరి డాట్ కామ్ లాంటి వెబ్సైట్లో నుండి కిలారు సీతయ్య అనే వ్యక్తి రెస్యూమ్‎లను డౌన్లోడ్ చేసుకున్నాడు.

తమ కంపెనీలో ఉద్యోగం కావాలంటే లక్ష రూపాయల చొప్పున చెల్లించాలని పలువురు నిరుద్యోగులకు టోకరా వేశాడు. ఈ కంపెనీ నిజమేనేమో అని నమ్మిన పలువురు బాధితులు కిలారు సీతయ్యకు అప్పు చేసి మరి లక్షలు సమర్పించారు. చివరకు ఫేక్ ఆఫర్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులను మోసం చేశాడు. ఆఫర్ లెటర్‎లో ఇచ్చిన అడ్రస్‎కి వెళ్లి చూసేసరికి ఎలాంటి కంపెనీ లేకపోవడంతో మోసపోయామని గ్రహించారు పలువురు యువకులు. కిలారు సీతయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు నిరుద్యోగులు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు కిలారు సీతయ్యను అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌