AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యానికి మంచిదని పసుపు తెగ ఉపయోగిస్తున్నారా.. కాలేయానికి ముప్పు.. రోజూ ఎంత వాడాలో తెలుసా..

పసుపును ఆహారంలో రుచిని , రంగును పెంచడానికి మాత్రమే కాదు అనేక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ మసాలా దినుసులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. పసుపుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్న చందంగా.. ఆరోగ్యకరం అని పసుపుని అవసరానికి మించి అధికంగా వాడితే ఆరోగ్యానికి ముప్పు ముఖ్యంగా కాలేయానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు పసుపు ఎంత మోతాదులో ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఆరోగ్యానికి మంచిదని పసుపు తెగ ఉపయోగిస్తున్నారా.. కాలేయానికి ముప్పు.. రోజూ ఎంత వాడాలో తెలుసా..
Turmeric Uses
Surya Kala
|

Updated on: Oct 06, 2025 | 12:10 PM

Share

పసుపు కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు. ఇది ఒక ఔషధ మూలిక కూడా. దీనిని శతాబ్దాలుగా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. ఇది లేకుండా వంట అసంపూర్ణంగా భావిస్తారు. కూరలు, పప్పులు లేదా ఏదైనా వ్యాధికి చికిత్స అయినా.. పసుపును ప్రతిదానికీ ఉపయోగిస్తారు. ఆయుర్వేదం కూడా పసుపుని మంచి ఔషధంగా పరిగణిస్తుంది. ఇది ఆహారం రుచి, రంగును పెంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలను, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

అయితే ఆహారంలో పసుపును అధికంగా వాడటం వల్ల కాలేయానికి హాని కలుగుతుందని కొందరు అంటున్నారు. అందుకనే దీనిని మితంగా వాడాలి. అయితే హార్వర్డ్‌లో శిక్షణ పొందిన డాక్టర్ సేథ్ ఒక పోస్ట్‌లో పసుపును సరైన మొత్తంలో వాడినప్పుడు కాలేయానికి హాని జరగదని పేర్కొన్నారు. ఈ రోజు ఆహారంలో పసుపును ఎంత మోతాదులో వాడాలో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఆహారంలో పసుపు ఎంత మోతాదులో వాడాలంటే

అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం… భారతదేశంలోని AIIMS నుంచి శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథ్ తన సోషల్ మీడియాలో తరచుగా ఆరోగ్య చిట్కాలను పంచుకుంటూ ఉంటారు. ఇటీవల డాక్టర్ సేథ్ పసుపును సరైన మొత్తంలో ఉపయోగించడం వల్ల కాలేయ నష్టాన్ని నివారించవచ్చని వివరిస్తూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. తన క్లినిక్‌కి వచ్చే వారు పసుపు కాలేయానికి ప్రయోజనకరమా లేదా హానికరమా అని తరచుగా అడుగుతారు” అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.

భారతీయులు పసుపును శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారని.. దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. కూరలు, టీ లేదా పాలతో కలిపి అర టీస్పూన్ నుంచి ఒక టీస్పూన్ పసుపు తీసుకోవడం సాధారణంగా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కాలేయంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను చూపదు. అయితే అధిక మోతాదులో పసుపు సప్లిమెంట్లను తీసుకున్నప్పుడు అది కాలేయానికి హానికరం కావచ్చు.

పసుపు ఎప్పుడు హానికరం?

కొన్ని అధ్యయనాల ప్రకారం కర్కుమిన్ ఫ్యాటీ లివర్ వ్యాధిలో వాపును తగ్గిస్తుందని తెలిపాయని డాక్టర్ సేథ్ వివరించారు. అయితే అధిక మోతాదులలో పసుపు ఉపయోగించడం, నిర్దిష్ట సప్లిమెంట్లు కాలేయానికి హానికరమని నిరూపించబడిన అనేక సందర్భాలు ఉన్నాయి. మొత్తంమీద పసుపు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆహారంలో ఉపయోగించడం సురక్షితం. కానీ అధిక మోతాదులో లేదా సప్లిమెంట్‌గా దీనిని సురక్షితంగా పరిగణించరు.

పసుపు అద్భుతమైన ప్రయోజనాలు

పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పాలీఫెనాల్ సమ్మేళనం. ఇది పసుపుకు ప్రకాశవంతమైన రంగును ఇస్తుంది. అమెరికన్ వెబ్‌సైట్ ది వెబ్‌మ్యాడ్ ప్రకారం కర్కుమిన్ వాపు, కడుపు పూతల , అధిక కొలెస్ట్రాల్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇది కడుపు సమస్యలు, మధుమేహం, నిరాశ, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పసుపు

పసుపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి ఒక వరం. ఇది చర్మ ఛాయను మెరుగుపరచడంలో, సహజమైన మెరుపును అందించడంలో , మచ్చలు , ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే