- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips: do these remedies to get goddess lakshmi devi blessings for money and prosperity
Vastu Tips for Money: ఎంత సంపాదించినా డబ్బులు నిలవడం లేదా.. ఈ పరిహారాలు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం
కొంత మంది భాగా కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితాలను కూడా అందుకుంటారు. అయితే ఎంత డబ్బు సంపాదించినా నెలాఖరు వచ్చే సరికి చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండడం లేదు అని బాధపడతారు. బాగా సంపాదించినా.. ఇంట్లో డబ్బులు ఉండదు. ఎప్పుడూ ఆర్ధిక కష్టాలే.. దీనికి కారణం వాస్తు దోషాలు అయి ఉండవచ్చు. ఇలాంటి సమస్యని అధిగమించడంలో సహాయపడే కొన్ని సింపుల్ పరిహయలు ఉన్నాయి. అవి ప్రభావంతంగా పని చేస్తాయి.
Updated on: Oct 06, 2025 | 11:39 AM

ప్రతి ఒక్కరూ ఆర్థిక ఇబ్బందులు లేని ఇంటిని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ.. ఆ ఇంట్లో డబ్బు నిలవదు. ఇంట్లో ప్రతికూల శక్తి ఇంటి ఆర్థిక పరిస్థితిని గణనీయంగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం దీనికి సంబంధించిన కొన్ని సులభమైన నివారణలను అందిస్తుంది. ఈ ప్రత్యేక నివారణలు లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను అందించడంలో సహాయపడతాయి. ఈ నివారణలు మన జీవితాల్లో.. ఇంటి వాతావరణంలో సానుకూల శక్తిని పెంచుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

అరటి చెట్టును పూజించడం: హిందూ మతంలో అరటి చెట్టును పవిత్రంగా భావిస్తారు. విష్ణువు ,లక్ష్మీ దేవి అరటి చెట్టులో నివసిస్తారని నమ్ముతారు. అంతేకాదు నవ గ్రహాల్లో అరటి చెట్టుని గురు కి సంబంధించినది అని విశ్వసం. అందువల్ల అరటి చెట్టును పూజించడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. అరటి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోసి పూజించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇంటికి సంపద, శ్రేయస్సు వస్తుంది.

సాయంత్రం దీపం వెలిగించండి: ప్రతి రోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో శాంతి, ఆనందం , శ్రేయస్సును సూచిస్తుంది. దీపం వెలుగు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటుంది. అ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు.

తులసి పూజ: తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందువల్ల తులసిని క్రమం తప్పకుండా పూజించడం.. తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఇంట్లో సంపదను పెంచడానికి, ప్రతి ఉదయం, సాయంత్రం తులసిని పూజించి .. తులసిమొక్క ముందు నెయ్యితో దీపం వెలిగించండి.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి: లక్ష్మీదేవి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడాన్ని అభినందిస్తుంది. అస్తవ్యస్తంగా ఉండటం .. మురికిగా ఉన్న ఇంటివైపు లక్ష్మీదేవి రాదని నమ్మకం. కనుక ఇంటి ముందు రోజూ ముగ్గు పెట్టి.. ఇంటిని రోజూ శుభ్రం చేసుకోవడం.. దుమ్ము, దులి, మురికి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి: ప్రత్యక్ష దైవం సూర్యనారాయనుడికి అర్ఘ్యం సమర్పించడం శక్తి , శ్రేయస్సు లభిస్తుంది. ప్రతి రోజూ ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సానుకూల శక్తి , బలం వస్తుంది. ఈ ఆచారం ఇంటికి సంపద, ఆరోగ్యం , విజయాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. సూర్యుడికి రాగి పాత్రలో సమర్పించడం అనేది లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను పొందడానికి సులభమైన ,ప్రభావవంతమైన మార్గం.




