- Telugu News Photo Gallery Venus transits into Virgo, bringing good luck to those born under four zodiac signs
కన్యారాశిలోకి శుక్రుడు.. వీరికి పట్టిందల్లా బంగారమే!
గ్రహాలు రాశుల్లోకి సంచారం చేయడం అనేది సహజం. ప్రతి నెల గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. అయితే అక్టోబర్ నెలలో సంపదకు కారకుడైన శుక్ర గ్రహం కన్యా రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Oct 06, 2025 | 2:03 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజ ప్రక్రియ. అయితే ఈ సంవత్సరంలో అక్టోబర్ 9వ తేదీన సంపదకు, శ్రేయస్సు, ఆనందానికి కారకుడైన శుక్ర గ్రహం , కన్యా రాశిలోకి ప్రవేశించనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అనేక రకాలుగా ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా ఆర్థికంగా కలిసిరానున్నది.

మిథున రాశి : మిథున రాశి వారికి అక్టోబర్ 9నుంచి శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. శుక్ర గ్రహం సంచారం వలన వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పుల సమస్యలు తొలిగిపోతాయి. అనుకోని విధంగా ఎక్కువ మొత్తంలో డబ్బు చేతికందుతుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మీన రాశి :మీన రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులు చాలా లాభాలు పొంది ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెల నుంచి ఆర్థిక పరమైన సమస్యలన్నీ తీరిపోనున్నాయి. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందుతుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జాబ్ దొరికే ఛాన్స్ ఉంది. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి ఖర్చులు అధికంగా పెరుగుతాయి. కానీ అంతకు మించి ఆదాయం రావడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైతే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.



