సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న బ్యూటీ.. నందిత లేటెస్ట్ పిక్స్ అదుర్స్
తెలుగులో 13 సినిమాలు చేసినా కూడా ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసు కదా.. ఆమె నందిత శ్వేతా. ఈ చిన్నది.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ.
Updated on: Oct 06, 2025 | 3:57 PM

చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న అవకాశాలు అందుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బ్యూటీలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు వారిలో ఈ అమ్మడు ఒకరు.

తెలుగులో 13 సినిమాలు చేసినా కూడా ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసు కదా.. ఆమె నందిత శ్వేతా. ఈ చిన్నది.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. 2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో నందిత శ్వేత పేరు మారుమ్రోగింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.

ఆ తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తుంది. ఆతర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమకథ చిత్రం 2 సినిమాల్లో నటించింది. కానీ మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయింది.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ క్రేజీ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ వయ్యారి భామ. ఇక సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలతో ఆకట్టుకుంటుంది నందిత. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ కుర్రదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.