AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pollution Effect: సంతానోత్పత్తిపై వాయు కాలుష్యం ఎలా ప్రభావితం చూపిస్తుందంటే..

వాయు కాలుష్యం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులోనూ ప్రస్తుతం చలి కాలం కాబట్టి కాలుష్యం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. వాయు కాలుష్యం కారణంగా శ్వాస సమస్యలు, క్యాన్సర్, బీపీ, షుగర్ వంటి సమస్యలే కాకుండా సంతానోత్పత్తి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..

Pollution Effect: సంతానోత్పత్తిపై వాయు కాలుష్యం ఎలా ప్రభావితం చూపిస్తుందంటే..
Pollution Effect
Chinni Enni
|

Updated on: Nov 29, 2024 | 4:58 PM

Share

కాలుష్యం అనేది ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. గాలి కలుషితం అవ్వడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం చలి కాలం కారణంగా మరింతగా ఈ సమస్య పెరుగుతుంది. గాలిని పీల్చుకుంటేనే మనిషి బతకగలడు. మొత్తం ఆరోగ్యం శ్వాసపైనే ఉంది. మీరు పీల్చే గాలి స్వచ్ఛంగా ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. గాలిలో నాణ్యత తగ్గడం వల్ల కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో అనేక దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు విపరీతంగా పెరిగాలి. ఈ కాలుష్యం.. సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపిస్తుందని పలువురు పరిశోధికులు చెబుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారన్న నమ్మకం లేదని అంటున్నారు.

తాజాగా హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనం ప్రకారం.. రోడ్డు మార్గాల సమీపానికి నివసించే స్త్రీలు గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న పట్టణాల్లో.. స్త్రీ, పురుషుల సంతానోత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడుతుందని వెల్లడించింది.

సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తాయి..

వాతావరణంలో వివిధ రకాల కాలుష్య ఉద్గారాల వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఇందులో అనేక రకాల కాలుష్య కారకాలు ఉంటాయి. వాటిల్లో.. నలుసు పదార్థం PM10, PM2.5, సల్ఫర్ డయాక్సైడ్ (SO2), నైట్రోజన్ ఆక్సైడ్లు (NOx), ఓజోన్ (O3), కార్బన్ మోనాక్సైడ్ (CO) వంటివే కాకుండా ఇతర కాలుష్య కారకాలు కూడా ఉన్నాయి. ఇవి ఎక్కువగా వాహనాల నుంచి, కర్మాగారాలు, అడవి మంటలు, భవనాల నిర్మాణం నుంచి విడుదల అవుతాయి. ఇంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలు.. గాలి పీల్చుకున్నప్పుడు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి కాస్తా స్త్రీ, పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇవి పురుషుల, మహిళల స్పెర్మ్ నాణ్యత తగ్గడానికి పరోక్షంగా ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం పడటం వల్ల త్వరగా వీరు తల్లిదండ్రులు కాలేరు. ఒక వేళ తల్లిదండ్రులు అయినా.. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా గర్భంతో ఉండే మహిళలు కూడా పొల్యూషన్‌కు దూరంగా ఉండాలని లేదంటే పుట్టే బిడ్డకు అనేక సమస్యలు రావచ్చని సూచిస్తున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..