AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: విటమిన్‌ డీ.. తక్కువే కాదు, ఎక్కువైనా ప్రమాదమే..

శరీరానికి సరిపడ విటమిన్‌ డీ లభించకపోతే ఇబ్బందులు తప్పవని తెలిసిందే. అందుకే కచ్చితంగా శరీరానికి సరిపడ విటమిన్‌ అందేలా చూసుకోవాలని సూచిస్తుంటారు. అయితే విటమిన్‌ డీ లభించకపోతే నష్టాలు ఉన్నాయన్నదాంట్లో ఎంత వరకు నిజం ఉందో.. విటమిన్‌ ఎక్కువైనా ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ శరీరంలో విటమిన్‌ డీ ఎక్కువైందన్న విషయాన్ని తెలిపే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: విటమిన్‌ డీ.. తక్కువే కాదు, ఎక్కువైనా ప్రమాదమే..
అంతేకాక, దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడతాయి, దాంతో దంతాలు వదులుగా మారడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. దీనితో పాటు రక్తహీనత కూడా వచ్చి, రక్తంలో ఐరన్ అర్బ్జోర్ తక్కువగా జరుగుతుంది. ఇది ఎర్ర రక్త కణాల సంఖ్యను తగ్గిస్తుంది, అందువల్ల మనం నిరుత్సాహంగా, అలసిపోయినట్లుగా కనిపిస్తాము.
Narender Vaitla
|

Updated on: Nov 29, 2024 | 5:01 PM

Share

శరీరానికి సహజంగా లభించే విటమిన్స్‌లో విటమిన్‌ డీ ఒకటి. ఎక్కువ సమయం ఏసీల్లో గడపడం, సూర్యరక్ష్మి ఇంట్లోకి రాని అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తుండడం వల్ల చాలా మంది విటమిన్‌ డీ లోపంతో బాధపడుతున్నారు. దీంతో కీళ్ల నొప్పులు మొదలు, హృదయ సంబంధిత సమస్యలు చివరికి మానసిక సమస్యలకు సైతం విటమిన్‌ డీ లోపం కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల విటమిన్‌డి లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే విటమిన్‌ డీ లోపం ఉందని నిర్థారించుకోకుండానే కొందరు సప్లిమెంటరీ ట్యాబ్‌లెట్స్‌ను వాడుతున్నారు. అయితే శరీరంలో విటమిన్‌ డీ తక్కువైతే సమస్యలు ఉంటాయన్నదాంట్లో ఎంత వరకు నిజం ఉందో విటమిన్‌ డీ ఎక్కువైనే అదే స్థాయిలో సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. వెనకా ముందు ఆలోచించకుండా ట్యాబ్లెట్స్‌ వాడితే పలు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇంతకీ విటమిన్‌ డీ ఎక్కువైన విషయాన్ని ఎలా తెలుసుకోవాలి.? ఎలాంటి లక్షణాల ఆధారంగా విటమిన్‌ డీ ఎక్కువైన విషయాన్ని కనుగొనవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

విటమిన్‌ డీ శరీరానికి ఎంత మంచి చేస్తుందో ఎక్కువైతే అన్నే సమస్యలకు దారి తీస్తుంది. సాధారణంగా మన శరీరంలో 20 మరియు 40 ng/ml మధ్య విటమిన్‌ డీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ వైద్యులను సంప్రదించకుండా, ఎలాంటి పరీక్షలు లేకుండా సప్లిమెంటరీలను తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు తప్పవని అంటున్నారు. వీటిలో ప్రధానమైనవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో విటమిన్‌ డీ స్థాయిలు ఎక్కువైతే.. కడుపులో వికారంగా ఉంటుంది. వాంతులు వేధిస్తుంటాయి. ఇక మలబద్ధకం సమస్య కూడా తప్పదని నిపుణులు అంటున్నారు. విటమిన్‌ డీ ఎక్కువైతే.. ఆకలి తగ్గిపోతుందుఇ. అదే విధంగా మానిసక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. నిత్యం గందరగోళం, నిరాశ, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వైద్యుల సూచనలు, వైద్య పరీక్షలతో సంబంధం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో విటమిన్‌ డీ ట్యాబ్లెట్స్‌ను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. సహజంగానే విటమిన్‌ డీ పందే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ఉదయాన్నే వచ్చే లేలేత సూర్య కిరణాలు చర్మంపై పడేలా చూసుకోవాలి. వారానికి రెండు నుంచి మూడు రోజుల పాటు ఎండలో ఉంటే సరిపోతుంది. అది కూడా రోజుకు 15 నుంచి 20 నిమిషాలు ఉండాలి. ఇక తీసుకునే ఆహారం ద్వారా కూడా విటమిన్‌ డీ పొందొచ్చు. ముఖ్యంగా చేపలు, పాలు, పప్పులు, ఆరెంజ్ జ్యూస్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..