AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Household Items: ఇంట్లో వాడే ఈ వస్తువులకు ఎక్స్‌పైరీ ఉన్నా పట్టించుకోరు.. సుదీర్ఘకాలం వాడితే ఎంత అనారోగ్యమో తెలుసా

నిత్యజీవితంలో రకరకాల వస్తువులను చాలా ఉపయోగిస్తుంటాం. వాటిల్లో కొన్ని రకాల వస్తువులను సుదీర్ఘకాలంగా ఉపయోగిస్తూనే ఉంటాం. ఎంతగా అంటే ఆ వస్తువులు విరిగిపోయే వరకు. దానికి గడువు తేదీ కూడా ఉండవచ్చని మనం గమనించం. అయితే ఇంట్లో ఉపయోగించే కొన్ని రకాల వస్తువులను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం చాలా ముఖ్యం.

Household Items: ఇంట్లో వాడే ఈ వస్తువులకు ఎక్స్‌పైరీ ఉన్నా పట్టించుకోరు.. సుదీర్ఘకాలం వాడితే ఎంత అనారోగ్యమో తెలుసా
Household Items
Surya Kala
|

Updated on: May 25, 2024 | 4:52 PM

Share

గడువు ముసిగిన వస్తువులను తినడం, ఔషధాలను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంట్లో ఉన్న మెడిసిన్ వేసుకోలనుకుంటే.. ముందుగా అవి ఎక్స్పైరీ అయ్యాయా లేదా అని డేట్ చూస్తారు. అంతేకాదు మార్కెట్‌లో కొన్ని ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడుమ కూడా ఉపయోగించే ముందు గడువు తేదీని తనిఖీ చేస్తారు. అయితే కొంతమంది కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోరు. ఇంట్లో అలాంటి వస్తువులు చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించవచ్చా, లేదా అనే గడువు తేదీని పట్టించుకోరు. ఎక్కువ కాలం వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వలన బ్యాక్టీరియా పెరుగుతుంది. అనారోగ్యానికి గురి చేస్తుంది.

నిత్యజీవితంలో రకరకాల వస్తువులను చాలా ఉపయోగిస్తుంటాం. వాటిల్లో కొన్ని రకాల వస్తువులను సుదీర్ఘకాలంగా ఉపయోగిస్తూనే ఉంటాం. ఎంతగా అంటే ఆ వస్తువులు విరిగిపోయే వరకు. దానికి గడువు తేదీ కూడా ఉండవచ్చని మనం గమనించం. అయితే ఇంట్లో ఉపయోగించే కొన్ని రకాల వస్తువులను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం చాలా ముఖ్యం.

సుదీర్ఘకాలంగా దిండును ఉపయోగించడం

ఇంట్లో దిండుని రోజూ ఉపయోగింస్తారు అయితే చాలా మంది దిండుకు ఉన్న కుషన్ కవర్‌ను మాత్రమే శుభ్రం చేస్తారు. అయితే దిండును ఎక్కువ సేపు కాలం ఉపయోగించడం వల్ల దుమ్ము, ధూళి పేరుకుని అందులో బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది. దీంతో జుట్టు రాలడం, ముఖంపై మొటిమలు వంటి సమస్యలు మొదలవుతాయి. అంతే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మంచిది కాదు. దిండును ఎప్పటికప్పుడు సూర్యరశ్మికి తగిలేలా చేసి ఏడాదిన్నర తర్వాత మార్చాలి.

ఇవి కూడా చదవండి

మేకప్ బ్రష్

చాలా మంది మహిళలు తమ ముఖానికి ఒకే రకమైన మేకప్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడుతూ ఉంటారు. బ్రష్‌ని ఉపయోగించిన తర్వాత శుభ్రం చేయకపోవడం లేదా ఇతరులు కూడా ఆ బ్రష్ ను ఉపయోగించడం అతి పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లతో పాటు.. కళ్లు, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కనుక మేకప్ బ్రష్ ను ఎక్కువ కాలం ఉపయోగించవద్దు. అదే సమయంలో ఇతరులకు ఇవ్వొద్దు.

టూత్ బ్రష్ ఎన్ని రోజులకు మార్చాలంటే

కొంతమంది తమ టూత్ బ్రష్‌ను సుదీర్ఘకాలం ఉపయోగిస్తారు. అది అరిగిపోయింది అనుకునేవరకూ టూత్ బ్రష్ ను ఉపయోగిస్తునే ఉంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం. టూత్ బ్రష్ ను ప్రతి మూడు నెలలకోసారి మార్చాలి.

డిష్ వాషింగ్ స్పాంజ్

పాత్రలను శుభ్రం చేయడానికి స్పాంజ్ లేదా స్క్రబ్బర్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ స్పాంజ్ లేదా స్క్రబ్బర్‌ను పూర్తిగా పాడయ్యే వరకూ పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తూనే ఉంటారు. ఇలా చేయడం వలన స్పాంజ్ లేదా స్క్రబ్బర్‌లో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా పాత్రల ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి గురి చేస్తుంది. కనుక స్పాంజ్ లేదా స్క్రబ్బర్‌ను ప్రతి రెండు నెలలకోసారి మార్చాలి.

దువ్వెనను ఎన్ని రోజులకు మార్చాలంటే

ఎవరైనా సరే దువ్వెనను ఎంత కాలం ఉపయోగిస్తారు అని అడిగితే సరైన సమాధానం దొరకదు. అయితే జుట్టుని దువ్వుకునే దువ్వెనను ఎక్కువ కాలం ఉపయోగించడం లేదా శుభ్రంగా లేని దువ్వెనను ఉపయోగించడం వల్ల శిరోజాలు దెబ్బతింటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ తో జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి