Viral Video: కాలేజ్ ఫ్యాషన్ షోలో లంగా ఓణీ, చీరతో మెరిసిన ప్రొఫెసర్లు.. వీడియో వైరల్

దాదాపు 6 నుంచి 10 మంది ప్రొఫెసర్లు మహిళలు ధరించే రకరకాల డ్రెస్లు వేసుకుని ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. కొందరు ఒంటరిగా వేదికను అలంకరించగా.. మరికొందరు తమ డ్రెస్సింగ్‌ను మరింత అందంగా చూపించేందుకు జంటగా ర్యాంప్‌పై అడుగు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా వ్యాపించడంతో పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అన్ని కళాశాలల్లో విద్యార్థులు మెరుస్తుంటే, ఇక్కడ ప్రొఫెసర్లు విద్యార్థులను అలరిస్తున్నారు.

Viral Video: కాలేజ్ ఫ్యాషన్ షోలో లంగా ఓణీ, చీరతో మెరిసిన ప్రొఫెసర్లు.. వీడియో వైరల్
Professors Walked The Ramp
Follow us

|

Updated on: May 25, 2024 | 3:40 PM

అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్ మీరిస్తే జనాలకు దడ. అంటూ నేటి యువత ఫ్యాషన్ గురించి ఓ రేంజ్ లో చెప్పేశాడు ఓ సినీ కవి. ప్రపంచ వ్యాప్తంగా రోజుకో ప్యాషన్ వెలుగులోకి వచ్చి ఫ్యాషన్ మార్కెట్ లో సందడి చేస్తూనే ఉంటుంది. రకరకాల ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్ లలో సాధారణంగా అందమైన యువతులు కనిపిస్తారు. అయితే తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఓ ఫ్యాషన్ షోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విశేషమేమిటంటే.. ఇక్కడ జంబలకిడిపంబ సినిమాను చూపించారు. ఈ స్టేజ్ మీద కొంతమంది ప్రొఫెసర్లు స్కర్టులు, చీరలు ధరించి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మహిళా ఉపాధ్యాయులు పురుషుల మాదిరిగానే చొక్కాలు, ప్యాంటు ధరించి ర్యాంప్ మీద నడిచి సందడి చేయగా.. పురుషులు సంప్రదాయ స్కర్టులు, చీరలతో క్యాట్‌వాక్‌లో నడిచారు.

ఈ వీడియో మే 23న @desimojito అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. వీడియో షేర్ చేసిన ఒక్క రోజులోనే ఏడు లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. దాదాపు 6 నుంచి 10 మంది ప్రొఫెసర్లు మహిళలు ధరించే రకరకాల డ్రెస్లు వేసుకుని ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. కొందరు ఒంటరిగా వేదికను అలంకరించగా.. మరికొందరు తమ డ్రెస్సింగ్‌ను మరింత అందంగా చూపించేందుకు జంటగా ర్యాంప్‌పై అడుగు పెట్టారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా వ్యాపించడంతో పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అన్ని కళాశాలల్లో విద్యార్థులు మెరుస్తుంటే, ఇక్కడ ప్రొఫెసర్లు విద్యార్థులను అలరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..