27 ఏళ్ల క్రితం అదృశ్యమైన బాలుడు.. ఇప్పుడు పొరుగువారి నేలమాళిగలో సజీవంగా..
ఒమర్ కేవలం 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు 1998లో అల్జీరియాలోని డిజెల్ఫాలోని తన ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఇటీవల ఒమర్ తమ పొరుగువారి నేలమాళిగలో కనుగొనబడ్డాడు. అది కూడా సజీవంగా బయటపడ్డాడు. ఆ పొరుగువారి ఇల్లు ఒమర్ ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. ఒమర్ తప్పిపోయిన సమయంలో అల్జీరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది.
ఒక్కోసారి వెలుగులోకి వచ్చిన సంఘటలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అంతేకాదు ఈ ఘటనలు వార్తల్లో నిలుస్తూ చర్చనీయాంశంగా మారతాయి. అలాంటి ఒక ఘటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాస్తవానికి చాలా సంవత్సరాల క్రితం అల్జీరియాలో ఒక బాలుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.కాలక్రమంలో ఆ బాలుడు ఒక్కడు ఉన్నాడనే విషయం కూడా మరచిపోయారు. అయితే కొన్ని సంవత్సరాల తరువాత ఆ బాలుడు ఎవరూ ఊహించని ప్రదేశంలో కనుగొనబడ్డాడు. ఈ అబ్బాయి పేరు ఒమర్ బిన్ ఒమ్రాన్. ఒమర్ కేవలం 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు 1998లో అల్జీరియాలోని డిజెల్ఫాలోని తన ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.
ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఇటీవల ఒమర్ తమ పొరుగువారి నేలమాళిగలో కనుగొనబడ్డాడు. అది కూడా సజీవంగా బయటపడ్డాడు. ఆ పొరుగువారి ఇల్లు ఒమర్ ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. ఒమర్ తప్పిపోయిన సమయంలో అల్జీరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. గ్రామంలో మాత్రమే కాదు ఇంటి చుట్టూ గందరగోళం నెలకొంది. అటువంటి పరిస్థితిలో, ఒమర్ తప్పిపోయాడు. అప్పుడు అతని ఫ్యామిలీ సభ్యులు, స్నేహితులు చాలా వెదికారు. అయితే ఒమర్ కనిపించలేదు. దీంతో బహుశా యుద్ధంలో మరణించి ఉంటాడు లేదా బహుశా ఒమర్ ని కిడ్నాప్ చేసి ఉంటారని అని భావించారు. ఎందుకంటే అప్పుడు జరిగిన ఘర్షణ సమయంలో సుమారు రెండు లక్షల మంది మరణించారు. దాదాపు 20 వేల మంది కిడ్నాప్‌కు గురయ్యారు.
ఎలా ఇపుడు బయట పడ్డాడంటే
నివేదికల ప్రకారం ఒమర్ కోసం కుటుంబ సభ్యులతో పాటు పోలీసు కూడా కొంతకాలం వెదికారు. తర్వాత అందరు అతని కోసం వెతకడం మానేశారు. అయితే ఒమర్ తల్లి తన కొడుకు ఎక్కడో చోట బతికే ఉన్నాడని ఆశతోనే ఉండేది. అయితే దురదృష్టవశాత్తు ఒమర్ తల్లి కూడా 2013 సంవత్సరంలో మరణించింది. ఇప్పుడు ఒమర్ బతికే ఉన్నా.. అతని కుటుంబంలో ఎవరూ జీవించి రు, అయితే ఇటీవల ఒమర్ పొరుగువారి సోదరుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. అందులో ఉమర్ కిడ్నాప్‌లో ఘటనలో తన సోదరుడి పాత్ర కూడా ఉందని పేర్కొన్నాడు. ఇలా చేయడానికి కారణం ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఒక సోదరుడు చేసిన పనిని మరొకరు బట్టబయలు చేశాడు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. 27 సంవత్సరాల క్రితం 17 సంవత్సరాల వయస్సులో అదృశ్యమైన ఒమర్ బిన్ ఒమ్రాన్.. అతని కుటుంబానికి 200 మీటర్ల దూరంలో ఉన్న పొరుగువారి సెల్లార్‌లో సజీవంగా కనిపించాడు.
NEW: Man who disappeared 27 years ago at the age of 17, found alive 200 meters from his family’s home in a neighbor’s cellar.
Insane.
Omar Bin Omran of Algeria disappeared 27 years ago. He went missing in 1998 on his way to a vocational school.
A 61-year-old is in police… pic.twitter.com/idkvSCykmh
— Collin Rugg (@CollinRugg) May 15, 2024
నిందితుడిని పట్టుకున్న పోలీసులు
ఇక్కడ, ఉమర్ బంధువులు సోషల్ మీడియాలో పోస్ట్‌ను చూసిన వెంటనే.. వెంటనే పోలీసులను సంప్రదించారు. పోలీసులు అనుమానాస్పద పొరుగువారి ఇంటిని శోధించారు. ఈ సోదాల్లో ఒమర్‌ను బేస్‌మెంట్‌లోని చిన్న సెల్‌లో బంధించినట్లు పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం పోలీసుల దాడిలో నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని పోలీసులు పట్టుకున్నారు. కొన్ని ఏళ్ల నుంచి ఒక సెల్‌లో బంధించడం వల్ల ఒమర్ శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని వైద్యులు తెలిపారు. తన కుటుంబసభ్యులు రోడ్డుపై వెళుతుండడాన్ని తాను చూసేవాడినని, కానీ సహాయం కోసం పిలిచే అవకాశం తనకు దొరకలేదని ఒమర్ చెప్పినట్లు తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,..