Love: బంగారం ఒకటి చెప్పనా.. చెట్టుకు నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది.. మరి ‘అది’ లేనప్పుడే కదా ప్రేమ వికసిస్తుంది..

బంగారం ఒకటి చెప్పనా..చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది.. అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా ప్రేమ విలువ నీకు తెలిసేది..అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈడైలాగ్ ఆధారంగా ప్రేమపై..

Love: బంగారం ఒకటి చెప్పనా.. చెట్టుకు నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది.. మరి 'అది' లేనప్పుడే కదా ప్రేమ వికసిస్తుంది..
Love
Follow us

|

Updated on: Sep 18, 2022 | 12:30 PM

love: బంగారం ఒకటి చెప్పనా..చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది.. అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా ప్రేమ విలువ నీకు తెలిసేది..అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈడైలాగ్ ఆధారంగా ప్రేమపై విస్తృతమైన చర్చ జరుగుతుంది. సాధారణంగా ప్రేమ అనేది జీవితంలో ఓ తియ్యని జ్ఞాపకం.. ప్రేమ ఎలా పుడుతుందో ఎప్పుడు పుడుతుందో చెప్పలేం..కాని ప్రేమ అంటే కేవలం ఒక అబ్బాయి.. అమ్మాయి మధ్య ఏర్పడేదే లవ్ గా చాలా మంది భావిస్తారు. కాని ప్రేమ అనే రెండు అక్షరాలు కేవలం దానికి మాత్రమే పరిమితం కాదు. కుటుంబ సభ్యులపై ప్రేమ కావచ్చు.. స్నేహితులపై ప్రేమ కావచ్చు. లేదా కొంతమంది కొన్ని ప్రదేశాలను, కొన్ని వస్తువులను, మరికొంతమంది కొన్ని ఆహార పదర్థాలను కూడా ప్రేమిస్తుంటారు. కాని ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమ అనేది ఉంటుంది. ఉండాలి కూడా.. అయితే ఈప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడే ఆప్రేమ బలంగా ఉంటుంది. ప్రేమలో అతి ఉంటే అది వికసించదు. నిజాయితీ ఉన్న ప్రేమ ఎళ్ల తరబడి బలంగా నిలబడి ఉంటుంది. జీవితాంతం కావల్సిన ప్రేమను పంచుతుంది. చెట్టుకి నీరు పోస్తేనే పువ్వుస్తాది. అలాగే జీవితంలో ప్రేమ అనేది నీరు లాంటింది. అది ఉన్నప్పుడు మన జీవితం కూడా పువ్వులా విరబూస్తుంది. పువ్వు రాలిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ చెట్టు బతుకుంది. మరెన్నో పువ్వులను, కాయలను మనకి అందిస్తుంది. ఒక రకంగా ప్రేమ అనేది నీరు లాంటిదని చెప్పవచ్చు. అలాగే ఆక్సిజన్ కూడా. ప్రేమ అనేది ఓ బూస్టర్ డోస్​ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమ లేకుంటే జీవితం లేదు అని అనుకోవడం కాదు కానీ.. మన లైఫ్​లో ప్రేమ ఉంటే.. ప్రేమించిన వ్యక్తి ఉంటే లైఫ్ బాగుంటాది అనేది వాస్తవం. ప్రతి ఒక్కరు దాని రుచిని అనుభవించి తీరాలి. ప్రేమ ఇచ్చే ధైర్యం.. అది ప్రేమ ఇచ్చే కేరింగ్.. ప్రేమ ఇచ్చే జ్ఞాపకాలు ఎప్పటికీ మరచిపోలేనివి. అందుకే మనల్ని ఎవరైనా ప్రేమిస్తే.. లేదా మనం ఎవరినైనా ప్రేమిస్తే వారిని మరచిపోలేము. ఈ ప్రేమ అనే రెండు అక్షరాలు మన లైఫ్​లో కీ రోల్​ ప్లే చేస్తుంది. అది వ్యక్తిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది. కానీ ఏదైనా అతిగా తీసుకుంటే అది అనర్థమే చేస్తుంది. కాబట్టి ప్రేమలో ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు. ఎలా వెళ్తుందో దానిని అలాగే వెళ్లనిస్తే మంచిది. దానిని ఏమాత్రం ఎక్కువ తీసుకున్నా ఆ ప్రేమ పాయిజన్ గా కూడా మారవచ్చు. అందుకే చాలా మంది ఎక్కువ ప్రేమిస్తారు. ఎక్కువ సఫర్ అవుతారు. ఒక్కోసారి తమ జీవితాన్నే నాశనం చేసేసుకుంటారు. తెలియకుండానే ఇవి జరిగిపోతుంటాయి.

మరో వైపు అబ్బాయి, అమ్మాయి మధ్య లవ్ లో చాలా అలెర్ట్​గా ఉండాలి. ఎందుకుంటే నీరు ఎక్కువైతే మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. దానికి ఎంత కావాలో అంత నీరే మనం ఇవ్వాలి. అలాగే ప్రేమలో కూడా లిమిట్ ఉండాలి. అన్ కండీషనల్​ లవ్​ ఎప్పుడూ ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమించండి. అంతేకానీ ప్రేమను అతి ప్రేమతో తీసుకెళ్తే మాత్రం.. అది మొత్తానికే మనకు దూరమవ్వచ్చు. ఎందుకంటే ఓవర్ డోస్ హెల్త్​కి అంత మంచిది కాదు. అతి ప్రేమ జీవితానికి అస్సలు మంచిది కాదంటున్నారు.

చాలామంది అనుకుంటారు ప్రేమిస్తే జీవితం నాశనం అయిపోతుందని.. లేదా సంతోషంగా ఉండరని. క ప్రేమలో హోప్స్ ఎక్కువైనప్పుడు.. ప్రేమ ఎక్కువైనప్పుడు.. అతి జాగ్రత్త ఎక్కువైనప్పుడు.. ఇలా ఈ అతిలన్నీ.. అత్యంతగా మారినప్పుడు ప్రేమను కోల్పోవాల్సి వస్తుంది. నేను ఇస్తుంది ప్రేమనే కదా.. అతి ఎలా అవుతాయి అనుకోవచ్చు. కానీ.. మీ ప్రేమను తీసుకోగలిగే శక్తి అవతలి వాళ్లకి కూడా ఉండాలి కదా. ఏమో మీ ప్రేమ తెలియకుండానే వారిని ఇబ్బంది పెడుతుందేమో. మీ ప్రేమ తెలియకుండానే జాగ్రత్తలనే పేరుతో బౌండరీలు గీస్తుందేమో. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ చిట్టా ఆగదు. కాబట్టి ప్రేమించండి. ఈ అతిని తీసి ప్రేమిస్తే.. మీరు కూడా ప్రేమలో మునిగి తేలవచ్చు. ఆ ప్రేమ విజయవంతమై వికసిస్తుంది. అలా కాకుండా పరిధిలు దాటి ప్రవర్తిస్తే మాత్రం ప్రేమ ఓ చేదు అనుభవంగానూ మారిపోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..