Holi 2022: హోలీ ఆడేముందు ఈ  పనులు చేయండి.. చర్మం.. కళ్లపై పడకుండా  ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

రంగుల పండగ వచ్చేసింది.. వాడ వాడలు పూర్తిగా రంగుల మయంగా మారిపోతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరి పై ఒకరు రంగులు

Holi 2022: హోలీ ఆడేముందు ఈ  పనులు చేయండి.. చర్మం.. కళ్లపై పడకుండా  ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Holi
Follow us

|

Updated on: Mar 18, 2022 | 9:53 AM

రంగుల పండగ వచ్చేసింది.. వాడ వాడలు పూర్తిగా రంగుల మయంగా మారిపోతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేమ.. ఆప్యాయతతో ఒకరిపై మరోకరు రంగులు చల్లుతూ..కౌగిలించుకుంటూ.. మనసులోని ద్వేషాలను తొలగించుకుంటారు. అందుకే మన హిందూ సంప్రదాయంలో హోలీ పండుగది ప్రత్యేక స్థానం. కానీ.. ఈ హోలీ వేడుకలలో చర్మం.. జుట్టు.. కళ్ళ పట్ల జగ్రత్తగా ఉండాలి. హోలీ ఆటలు ఆడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.. అవెంటో తెలుసుకుందామా..

అన్నింటికంటే ముందు నిండుగా బట్టలు ధరించండి. శరీరాన్ని మొత్తాన్ని కప్పి ఉంచేలా పాత బట్టలు ధరించండి. దీంతో శరీరంపై తక్కువగా రంగు పడుతుంది.. అలాగే.. హోలీ వేడుకలలో పాల్గొనే ముందు చర్మానికి కోల్డ్ క్రీమ్ లేదా ఆయిల్ రాయాలి. ఇలా చేయడం వలన చర్మం రంగు నిలవదు..

ఎండలు విపరీతంగా ఉన్నాయి. రోజు రోజూకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. హోలీ వేడుకలకు వెళ్లేప్పుడు టానింగ్ నివారించడానికి వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్‏ను అప్లై చేయాలి. సన్ క్రీమ్ చర్మాన్ని టానింగ్ నుంచి కాపాడడమే కాకుండా… రంగు చర్మం లోపలి పొరలోకి వెళ్లకుండా చేస్తుంది. అలాగే నీరు ఎక్కువగా తాగాలి. ఇలా చేయడం వలన చర్మంలో తేమ ఉంటుంది. నీరు తక్కువగా తాగితే చర్మం పొడిబారుతుంది. దీంతో రంగు పడినప్పుడు తీవ్ర ప్రభావం ఉంటుంది..

హోలీ ఆడుతున్నప్పుడు పెదాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పెదవులకు లిప్ బామ్ లేదా వాసెలిన్ అప్లై చేయాలి. రంగు పడినప్పుడు సురక్షితంగా ఉంటాయి. హోలీ రంగులు మీద పడినప్పుడు కొందరికి చర్మంలో మంటలు వస్తాయి. అలాగే చర్మం ఎర్రబడడం.. మంటగా అనిపించడం… దురద రావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు వెంటనే చల్లని నీరు పోయాలి. అప్పటికీ దురద తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి.

హోలీ వేడుకలలో జుట్టుపై రంగు పెద్ద మొత్తంలో పడుతుంది. అందుకే ముందుగా జుట్టు ఎక్కువగా నూనె రాయాలి. దీంతో జుట్టు మూలాలను దెబ్బతిసే రసాయనాల నుంచి జుట్టు రక్షించబడుతుంది. కళ్లను కాపాడుకోవడం కోసం సన్ గ్లాసెస్ లేదా గ్లేర్స్ ధరించాలి. ఇలా చేస్తే హోలీ రంగులు కళ్లలోకి వెళ్లవు.. అలాగే.. పొరపాటున కళ్లలో రంగు పడితే రుద్దడం చేయకూడదు. వీలైతే ఆర్గానిక్ రంగులను మాత్రమే ఉపయోగించాలి. ఇవి చర్మం, జుట్టు, కళ్లకు హాని కలిగించవు. పింక్, పసుపు, లేత ఎరుపు రంగులను ఉపయోగించడం మంచింది. వంకాయ, నలుపు లేదా బూడిద వంటి శుభ్రపరచడానికి వీలు లేని రంగులను ఉపయోగించకపోవడం మేలు..

హోలీ వేడుకల తర్వాత చేతులను బాగా శుభ్రం చేసుకున్న తర్వాతే తినాలి. ఒకవేళ చేతులను సరిగ్గా శుభ్రం చేయకపోతే గోళ్లలో ఉంటే రంగు.. రసాయనాలు కడుపులోకి వెళ్లిపోతాయి. దీంతో శరీరానికి హానికరంగా మారతాయి. అందుకే ఏదైనా తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

Also Read: Andhra: ఏపీలో ‘RRR’ సినిమా టికెట్స్ రేట్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉండనున్నాయ్ అంటే..?

HanuMan: శరవేగంగా హను-మాన్ మూవీ షూటింగ్.. సూపర్ హీరోగా కనిపించనున్న తేజ

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో

Nazriya Nazim : అంటే సుందరానికి మూవీ నుంచి నాని ప్రేయసి లుక్ వచ్చేసింది.. ఎంత క్యూట్‌గా ఉందో..