AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Doctor Role Model: డాక్టర్‌గా రోగులకు సేవలందిస్తూ.. మోడల్‌గా రాణిస్తున్న 67 ఏళ్ల వైద్యురాలు

Doctor Role Model: వయస్సుకు సంబంధించిన అన్ని పద్ధతులను ధిక్కరిస్తూ, అటు వైద్యురాలిగా, ఇటు మోడల్ గా ఎదిగి అందరు గర్వించేలా చేశారు. వృద్ధులకు ఫ్యాషన్ పట్ల అవగాహన కల్పించేందుకు..

Doctor Role Model: డాక్టర్‌గా రోగులకు సేవలందిస్తూ.. మోడల్‌గా రాణిస్తున్న 67 ఏళ్ల వైద్యురాలు
Doctor Gita Prakash
Subhash Goud
|

Updated on: Mar 18, 2022 | 9:51 AM

Share

Doctor Role Model: వయస్సుకు సంబంధించిన అన్ని పద్ధతులను ధిక్కరిస్తూ, అటు వైద్యురాలిగా, ఇటు మోడల్ గా ఎదిగి అందరు గర్వించేలా చేశారు. వృద్ధులకు ఫ్యాషన్ పట్ల అవగాహన కల్పించేందుకు 67 ఏళ్ల బామ్మ తన స్వంత అంతర్గత దుస్తుల సేకరణను ప్రారంభించింది . మోడలింగ్‌ (Modeling) రంగంలో యువ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. మోడలింగ్ రంగంలో యువ మోడళ్లకు పోటీ ఇస్తున్నారు 67 ఏళ్ల వైద్యురాలు అండ్‌ మోడల్ గీతా ప్రకాష్ (Doctor Gita Prakash). ఈ రోజు ఆమె జనరల్ ఫిజీషియన్ తరుణ్ తహిలియాని, గౌరవ్ గుప్తా, టోరానీ, జేపూర్ వంటి అనేక మంది డిజైనర్లకు పోటినిస్తూ సక్సెస్‌ఫుల్‌ మోడల్గా ఎదిగింది. అయితే కొత్త కెరీర్‌ని ప్రారంభించాలనే ఆశలన్నీ కోల్పోయే వయసులో తనకు మోడలింగ్ అవకాశం ఎలా వచ్చిందో పూర్తి వివరాలు తెలియజేస్తూ డాక్టర్ మోడల్ షేర్ చేసింది.

ఆమె మాట్లల్లోనే.. నేను మొదట్లో మోడలింగ్ గురించి ఆలోచించలేదు. నేను డాక్టర్‌గా నా వృత్తిలో నేను హ్యాపీగా ఉన్నాను. 57 సంవత్సరాల వయస్సులో మోడల్ అవుతానని ఏనాడు కూడా అనుకోలేదు. ఒక రోజు ఇటాలియన్ ఫోటోగ్రాఫర్ చికిత్స కోసం నా క్లినిక్‌కి వచ్చారు. చికిత్స పూర్తయిన తరువాత మోడలింగ్ చేస్తారా అని నన్ను అడిగాడు. నేను మోడలింగ్ చేయడం ఏంటని అన్నాను. కొన్ని నెలల తరువాత అతడు నాకు లెటర్ రాసి నా ఫోటోలను పంపించమని అడిగాడు. నా దగ్గర ఉన్న పాత ఫోటోలనే నేను అతనికి పంపించాను. ఇది జరిగిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత తహిలియాని యాడ్ లో పాల్గొనే అవకాశం లభించింది. అప్పుడు ‘జయ్‌పూర్’ బ్రాండ్ వారి ‘శాలువా’ కోసం మోడలింగ్ చేయడానికి నన్ను సంప్రదించింది. ఎందుకంటే ఆ శాలువాలు ఎక్కువగా నా వయస్సులో ఉన్న స్త్రీలు ధరిస్తారు.

మోడలింగ్‌ చేయడం పెద్దగా కష్టం అనిపించలేదు:

అయితే డాక్టర్‌గా తన ఉద్యోగాన్ని చేసుకుంటూ మోడలింగ్ చేయడం ఆమెకు పెద్దగా కష్టంగా అనిపించలేదు. పైగా ఇష్టంగా చేస్తున్నారు. మోడలింగ్‌కు ఓ సమయం పెట్టుకున్నాను. ముందు నా వృత్తి ఆ తరువాతే నా ప్రవృత్తి అని అనుకున్నాను. నా దగ్గరకు వచ్చే రోగులను ఎన్నడూ నిరుత్సాహపరచలేదు. సమయానికి వారికి ట్రీట్ మెంట్ చేసి పంపిస్తాను.

ఇప్పుడు నేను మోడలింగ్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నాను:

ఇప్పుడు నేను మోడలింగ్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేయడం నాకు ఎంతో ఇష్టం. ఇంట్లో ఒక ఛారిటబుల్ క్లినిక్‌ని కూడా నడుపుతున్నాను. ఇంటికి వచ్చే రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తాను అని గీతా ప్రకాష్ ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారు. వారు నన్ను బిల్‌బోర్డ్‌పై లేదా మరెక్కడైనా నా ఫోటోలు చూసిన ప్రతిసారీ చాలా ఉత్సాహంగా ఉంటారు. అమ్మా అది బావుంది.. ఇది బావుంది అంటూ వివిధ మ్యాగజైన్లలో చూసిన నా చిత్రాలను పంపుతుంటారు. ఇవి చూసిన నాకు ఎంతో సంతోషం అనిపించింది.

ఇవి కూడా చదవండి:

Hyperloop India: హైపర్‌లూప్ టెక్నాలజీపై ప్రయోగాలు.. సత్తా చాటిన చెన్నై ఐఐటీ విద్యార్థులు

Russia Ukraine Crisis: దారుణ హత్యకు గురైన రష్యా మోడల్.. పుతిన్‏ను తిట్టడం వల్లనేనా..!