Hyperloop India: హైపర్‌లూప్ టెక్నాలజీపై ప్రయోగాలు.. సత్తా చాటిన చెన్నై ఐఐటీ విద్యార్థులు

IIT Madras students: 350 కిలోమీటర్లు కేవలం 25 నిమిషాల్లో వెళ్లొచ్చు. ఏంటీ షాకయ్యారా? కానీ ఇది త్వరలోనే మన దేశంలోనే నిజం కానుంది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేద దేశాల వరకు

Hyperloop India: హైపర్‌లూప్ టెక్నాలజీపై ప్రయోగాలు.. సత్తా చాటిన చెన్నై ఐఐటీ విద్యార్థులు
Hyperloop
Follow us

|

Updated on: Mar 17, 2022 | 9:49 AM

IIT Madras students: 350 కిలోమీటర్లు కేవలం 25 నిమిషాల్లో వెళ్లొచ్చు. ఏంటీ షాకయ్యారా? కానీ ఇది త్వరలోనే మన దేశంలోనే నిజం కానుంది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేద దేశాల వరకు, అన్నీ ప్రయాణ సమయాన్ని తగ్గించడానికే ఆలోచిస్తాయి. ప్రస్తుతం రోడ్డు, రైలు, వాయు, సముద్ర మార్గాల ద్వారా ప్రయాణాలు సాగుతున్నాయి. అయితే ఆ సమయాన్ని కూడా తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీలను సృష్టిస్తున్నారు పరిశోధకులు. వాటిల్లో కొత్తది హైపర్‌లూప్ టెక్నాలజీ. ఈ సాంకేతికతతో 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ హైపర్‌లూప్ టెక్నాలజీపై అధ్యయనం చేస్తున్నారు చెన్నై ఐఐటీ విద్యార్థులు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చని అంటున్నారు చెన్నై ఐఐటీ స్టూడెంట్స్‌.

ఈ హైపర్ లూప్ ఐడియాను ముందుగా చెప్పారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. సాధారణంగా ఓ వాహన వేగం అనేది ఘర్షణ, ఎయిర్‌ రెసిస్టెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. వేగాన్ని నియంత్రించే ఈ ఫ్రిక్షన్, ఎయిర్‌ రెసిస్టెన్స్‌ను హైపర్‌లూప్ టెక్నాలజీ వినియోగించి అధిగమించొచ్చు. ఈ టెక్నాలజీ సాయంతో ప్రయాణించాలంటే, ఓ భారీ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఇందులోకి గాలిని పంపించి వాక్యూమ్‌ను సృష్టిస్తారు. ఆ తర్వాత పాసింజర్ పాడ్‌ను ఆ ట్యూబ్‌కు అటాచ్ చేస్తారు. ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌ను అయస్కాంత క్షేత్ర విక్షేపం ద్వారా ప్రయాణించేలా చేస్తారు.

అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు భవిష్యత్తులో ఈ టెక్నాలజీని కార్యరూపంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి. అయితే, ఈ హైపర్‌లూప్ టెక్నాలజీ సాయంతో ఓ వాహనాన్ని 100 మీటర్లు నడిపించి ఎన్నో అవార్డులు పొందారు చెన్నై ఐఐటీ విద్యార్థులు. త్వరలోనే 500 మీటర్ల పాటు ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది విజయవంతమైతే భారత ప్రయాణ చరిత్రలో మరో రికార్డ్ సృష్టించినట్లే అని అంటున్నారు నిపుణులు. ఈ హైపర్‌లూప్ వాహనం గంటకు 12 వందల 23 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

Also Read:

WHO: ముప్పు తొలగిపోలేదు.. ముందు ముందు పెను ప్రమాదం పొంచి ఉంది… డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

Xiaomi: షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. 120w ఫాస్ట్‌ చార్జింగ్‌.. అత్యాధునిక ఫీచర్స్‌..!

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ