AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHO: ముప్పు తొలగిపోలేదు.. ముందు ముందు పెను ప్రమాదం పొంచి ఉంది… డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

ఒమిక్రాన్, కరోనా కేసులు తగ్గలేదని, వాటి వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని డబ్ల్యూహెచ్ఓ(WHO) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, స్వల్ప విరామం తర్వాత...

WHO: ముప్పు తొలగిపోలేదు.. ముందు ముందు పెను ప్రమాదం పొంచి ఉంది... డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
Who
Ganesh Mudavath
|

Updated on: Mar 16, 2022 | 3:14 PM

Share

ఒమిక్రాన్, కరోనా కేసులు తగ్గలేదని, వాటి వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని డబ్ల్యూహెచ్ఓ(WHO) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, స్వల్ప విరామం తర్వాత వైరస్‌(Virus) కేసులు మళ్లీ పెరుగుతున్నాయని పేర్కొంది. కొవిడ్ నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ మళ్లీ విజృంభిస్తోందని, తెలిపింది. చైనా(China) సహా కొన్ని దేశాల్లోనూ కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్నందున.. డబ్ల్యూహెచ్‌ఓ ఎపిడెమిలాజిస్ట్‌ మరియా వాన్‌ ఖెర్ఖోవ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం.. మార్చి 7-13 మధ్య ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు 8శాతం పెరిగాయి. అత్యధికంగా దక్షిణ కొరియా, వియత్నాం, జర్మనీ దేశాల్లో ఈ పెరుగుదల కన్పించింది.

                        కొవిడ్‌ 19 వ్యాప్తి ఇంకా తొలగిపోలేదు. అది ఇప్పుడే అంతమవుతుందని అనుకోవడం లేదు. కరోనా వ్యాప్తి మరింత ఉద్ధృతంగా ఉండబోతోందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి సమాధానాలు వెతికే ముందు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇటీవల కొన్ని వారాల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. పరీక్షల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్‌ రేటు ఎక్కవగా ఉందని చెప్పి కొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలను ఎత్తివేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి.

                        – మరియా వాన్ ఖెర్కోవ్

కరోనా సవాళ్లను ఎదుర్కోవడంలో దేశాలను బట్టి భిన్నమైన పరిస్థితులు ఉండొచ్చని మరియా అభిప్రాయపడ్డారు. కానీ మహమ్మారి మాత్రం ఇంకా అంతం కాలేదని.. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షలు, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లు, వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలన్నారు. చైనాలో గత కొద్ది రోజులుగా కరోనా మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. కొత్త కేసులు రెండేళ్ల గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. చైనా వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు.

Also Read

RRR Pre Release Event: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్

Viral Video: ఈ ఆవు యమ స్మార్ట్ గురూ..! ఏకంగా అడ్రసే చెప్పేసింది.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

VAMNICOM Jobs 2022: వైకుంఠ మెహతా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..