Stealth Omicron Variant: చైనాను వణికిస్తున్న మరో కొత్త వేరియంట్.. 13 నగరాల్లో లాక్‌డౌన్
Stealth Omicron Variant: కరోనా మహమ్మారితో గత రెండేళ్లుగా ఇబ్బందులకు గురై ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్న చైనీయులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి...
Stealth Omicron Variant: కరోనా మహమ్మారితో గత రెండేళ్లుగా ఇబ్బందులకు గురై ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్న చైనీయులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మరో కొత్త వేరియంట్ ముంచుకొస్తోంది. దీంతో చైనా ప్రజలు మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. చైనాలో ‘స్టెల్త్ ఒమిక్రాన్- రూపంలో కరోనా (Corona) మహమ్మారి వణికిస్తోంది. రెండు సంవత్సరాల తర్వాత చైనా (China)లో మంగళవారం అత్యధికంగా 5,280 కొత్త కోవిడ్ కేసులు నమోదు అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ముందురోజు కంటే కేసులు రెట్టింపు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్న చైనాకు మళ్లీ కష్టాలు మొదలైనట్లే. డ్రాగన్ దేశానికి కరోనా దడ పుట్టిస్తోంది.
వరుసగా ఆరో రోజు వెయ్యికిపైగా కేసులు:
ఇక వరుసగా ఆరో రోజు వెయ్యికిపైగా కేసులు నమోదు అవుతున్నాయి. చైనాలో 2020 ఫిబ్రవరి 12న అత్యధికంగా దాదాపు 15000 కేసులు బయటపడ్డాయి. ఇక ఆ తర్వాత రోజు 5,090 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో చైనా 13 పెద్ద నగరాను సైతం మూసివేసింది. 3 కోట్ల మందికిపైగా ప్రజలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు సైతం మూతపడే పరిస్థితి వచ్చింది. రవాణా సౌకర్యం కూడా నిలిచిపోయింది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.
‘స్టెల్త్ ఒమిక్రాన్’ ఏమిటీ?
చైనాను వణికిస్తున్న ‘స్టెల్త్ ఒమిక్రాన్’ గురించి ఇప్పుడు చాలా మంది ఇంటర్నేట్‌లో సెర్చ్ చేస్తున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు ఉపకరమైన ‘బీఏ.2’ను స్టెల్త్ ఒమిక్రాన్‌గా పిలుస్తున్నారు. ఈ వేరియంట్‌పై బ్రిటన్ ఆరోగ్య భద్రత సంస్థ పరిశోధనలు జరుపుతోంది. థర్డ్‌వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది కొత్త వేరియంట్ 1.5 రెట్ల వేగంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ‘స్టెల్త్ ఒమిక్రాన్’కు సంబంధించి.. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల్లో ఈ వేరియంట్‌ను నిర్దిష్టంగా గుర్తించడానికి అవసరమయ్యే స్పైక్ ప్రొటీన్లలోని కొన్ని ఉత్పరివర్తనాలు లేనట్లు చెబుతున్నారు పరిశోధకులు.
దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ విజృంభణ:
ఇక ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణ కొరియాలో ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కల్లోలం రేపుతోంది. గత ఏడాది డిసెంబర్ వరకు ఈ దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6.3 లక్షలు కాగా, మంగళవారం ఆ సంఖ్య 72లక్షలు దాటింది. వారం రోజులుగా సగటున 3.37 లక్షల రోజువారి కేసులుగా నమోదు కావడం భయాందోళనకు గురి చేస్తోంది. మంగళవారం ఒక్క రోజే 293 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది.
ఇవి కూడా చదవండి: