UK Covid 19: యూకేలో పెరుగుతున్న కరోనా వైరస్.. గతవారంతో పోలిస్తే కేసులు పెరుగుదల
UK Covid 19: బ్రిటన్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు, పేషెంట్లు ఆస్పత్రిలో చేరడంపై యునైటెడ్ స్టేట్స్ నిశితంగా గమనిస్తోందని డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మంగళవారం..
UK Covid 19: బ్రిటన్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు, పేషెంట్లు ఆస్పత్రిలో చేరడంపై యునైటెడ్ స్టేట్స్ నిశితంగా గమనిస్తోందని డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మంగళవారం తెలిపారు. యూకేలో కోవిడ్ కేసులు గత వారంలో 77 శాతం పెరిగి లక్ష పాజిటివ్ కేసుల వరకు నమోదు కాగా, రోజువారీ కేసుల పరంగా చూస్తే.. UK అంతటా మరో 109,802 పాజిటివ్ కేసులు నమోదై ఒక వారంలో 77.4% పెరిగిందని పేర్కొన్నారు. స్కాట్లాండ్‌లో కూడా కోవిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. Omicron వేరియంట్ మీజిల్స్ వలె అంటు వ్యాధి అని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ ఆసుపత్రిలో వారానికి 12.7% పెరిగింది. వారంలో రోజువారీ వైరస్ మరణాలు 5.7% తగ్గి 200కి చేరుకున్నాయి. ఇప్పుడు బ్రిటన్‌లో అత్యధిక BA.2 స్ట్రెయిన్ కేసులు నమోదు అవుతున్నాయి. కేసులను తగ్గించేందుకు అధికారులు మరిన్ని చర్యలు చేపడుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ అధికారి ఈరోజు BA.2 ఇతర వేరియంట్ల కంటే 40 శాతం ఎక్కువగా వ్యాపిస్తుందని హెచ్చరించాడు. ఇది మీజిల్స్ వలె అంటువ్యాధిలా ఉంటుందని, అత్యంత సంక్రమించే వ్యాధులలో ఇది ఒకటి చెబుతున్నారు. ఇక చైనాలో కూడా మళ్లీ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిందనుకునేలోపు మళ్లీ కేసులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ రోజువారి కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తోంది చైనా ప్రభుత్వం. కరోనా పుట్టినిల్లుగా ఉన్న చైనాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ముందస్తు చర్యలు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నాయి.
గత రెండేళ్లుగా విజృంభిస్తున్న కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం లేదు. ఒక వైపు కరోనాతో జీవించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టి ప్రస్తుతం అదుపులోకి రాగా, మళ్లీ విజృంభిస్తుండటంతో మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇతర దేశాల్లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా కట్టడికి మళ్లీ చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి: