Russia Ukraine War: సూర్యోదయానికి ముందే రష్యా ఆర్మీ విధ్వంసం.. కీవ్‌పై బాంబుల వర్షం..
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. నాటో కూటమిలోని పోలండ్, చెక్, స్లొవేకియా దేశాధినేతలు నిన్న కీవ్‌ను సందర్శించిన నేపథ్యంలో రష్యా దూకుడు పెంచింది. ఒక విశ్వవిద్యాలయంపై,.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. నాటో కూటమిలోని పోలండ్, చెక్, స్లొవేకియా దేశాధినేతలు నిన్న కీవ్‌ను సందర్శించిన నేపథ్యంలో రష్యా దూకుడు పెంచింది. ఒక విశ్వవిద్యాలయంపై, మరో మార్కెట్‌పై దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారనీ, సురక్షిత ప్రాంతాలకు ప్రజల్ని చేరవేస్తున్న బస్సుపై జరిపిన కాల్పుల్లో ఒక వృద్ధురాలు చనిపోయారు. సూర్యోదయానికి ముందే రష్యాఆర్మీ కీవ్‌లో విధ్వంసం సృష్టించాయి. 15 అంతస్తుల అపార్ట్‌మెంటుపై బాంబుల వర్షం కురిపించింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, వందలాది మంది లోపలే చిక్కుకుపోయారు. పొడిల్‌స్కీలో మరో 10 అంతస్తుల అపార్ట్‌మెంటుపైనా ఇలాంటి దాడే జరిగింది. అక్కడున్న యూనివర్శిటీపై, మరో మార్కెట్‌పై జరిగిన దాడుల్లో 10 మంది చనిపోయారు. ఇక సురక్షిత ప్రాంతాలకు ప్రజల్ని చేరవేస్తున్న బస్సుపై జరిపిన కాల్పుల్లో ఒక మహిళ స్పాట్‌లోనే మృతి చెందారు. ఖేర్సన్ నగరంలో పలు ప్రాంతాలు పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లాయి.
మరోవైపు రష్యా ప్రతీకార చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న బైడెన్, హిల్లరీక్లింటన్, ఇతర అమెరికా ఉన్నతాధికారులపై రష్యా ఆంక్షలు విధించింది. అటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై కూడా రష్యా ఆంక్షలు విధించింది. 300మంది కెనడావాసులు రష్యాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి: AP CM YS Jagan: రెండేళ్లలో పరీక్షా సమయం రాబోతోంది.. అంతా సిద్ధంగా ఉండాలిః సీఎం వైఎస్ జగన్
Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!