AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: దారుణ హత్యకు గురైన రష్యా మోడల్.. పుతిన్‏ను తిట్టడం వల్లనేనా..!

Russia Ukraine Crisis: రష్యాకు చెందిన ప్రముఖ మోడల్ గ్రేట్టా వేదలెర్ (23) దారుణ హత్యకు గురైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ని "సైకోపాత్"

Russia Ukraine Crisis: దారుణ హత్యకు గురైన రష్యా మోడల్.. పుతిన్‏ను తిట్టడం వల్లనేనా..!
Model
Shiva Prajapati
| Edited By: Rajitha Chanti|

Updated on: Mar 18, 2022 | 8:05 AM

Share

Russia Ukraine Crisis: రష్యాకు చెందిన ప్రముఖ మోడల్ గ్రేట్టా వేదలెర్ (23) దారుణ హత్యకు గురైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ని “సైకోపాత్” అంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోసింది ఈమె. ఈ క్రమంలో దారుణ హత్యకు గురవడం.. అనేక సందేహాలకు దారి తీస్తుంది.

అయితే. వెడ్లర్‏ను తానే చంపానని ఆమె మాజీ ప్రియుడు డిమిత్రి కొరోవిన్ పోలీసులకు వెల్లడించాడు. వెడ్లర్ ను చంపి లిపేట్స్క్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్లు ఒప్పుకున్నాడు.

ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ఏడాది క్రితమే ఈమెను హతమార్చాడు కొరోవిన్. ఒక హోటల్ గదిలో వీరిద్దరూ ఉన్న సమయంలో వెడ్లర్ ని చంపి.. దాదాపు నాలుగు రోజుల పాటు డెడ్ బాడీ తోనే ఉన్నాడు. అనంతరం ఒక సూట్ కేస్ లో ఆ డెడ్ బాడీ ని కుక్కాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు.. ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో ఆమెకు సంబందించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండే వాడు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో.. మోడల్ హత్య సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే.. 2021 జనవరిలో మోడల్ వెడ్లర్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను దూషిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. పుతిన్ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా, రష్యా సమగ్రతను పరిరక్షించాలి చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొంది. ఆ సందర్భంగా పుతిన్ పై పలు విమర్శలు చేసింది.

“నా అభిప్రాయం ప్రకారం, అతనిలో స్పష్టమైన మానసిక రోగాలు లేదా సోషియోపతి కనిపిస్తున్నాయి. ఇలాంటి సైకోపాత్‌లు కోసం చాలా ప్రమాదం. వీరు.. తీవ్రమైన అనుభవాలు, తీవ్రమైన కమ్యూనికేషన్, తీవ్రమైన కార్యాచరణ, డైనమిక్ జీవితాన్ని ఇష్టపడతారు.” అని సోషల్ మీడియా వేదికగా పుతిన్ పై విమర్శలు చేసింది వెడ్లర్.

Also Read: Andhra: ఏపీలో ‘RRR’ సినిమా టికెట్స్ రేట్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉండనున్నాయ్ అంటే..?

HanuMan: శరవేగంగా హను-మాన్ మూవీ షూటింగ్.. సూపర్ హీరోగా కనిపించనున్న తేజ

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో

Nazriya Nazim : అంటే సుందరానికి మూవీ నుంచి నాని ప్రేయసి లుక్ వచ్చేసింది.. ఎంత క్యూట్‌గా ఉందో..