RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Mar 17, 2022 | 7:21 PM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో
Rrr

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు బిగ్ స్టార్స్.. భారీ బడ్జెట్.. డిఫరెంట్ స్టోరీ.. ఇలా ఈ సినిమాలో ఎన్నో ఆసక్తికర అంశాలను జోడించారు జక్కన్న. అటు మెగా ఫ్యాన్స్.. ఇటు నందమూరి అభిమానులు.. ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్‌ ఇండియా మూవీ ట్రిపుల్‌ ఆర్‌కు సంబంధించి.. టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో స్పష్టత వచ్చింది. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి.. మరో అప్డేట్‌ను ప్రభుత్వానికి ఇచ్చింది చిత్ర బృందం. జీఎస్టీ కాకుండా ఈ సినిమా ఖర్చును 336 కోట్ల రూపాయలకు తెలిపిన నిర్మాతలు.. హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్‌తో కలిపి అది 478 కోట్ల రూపాయలని తెలిపింది. వచ్చిన లాభాల్లో  చేరి సగం (దర్శకుడు , ప్రొడ్యూసర్) తీసుకోనున్నారు. ఈమేరకు 12 ఏళ్ల క్రితం డైరెక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చారట ప్రొడ్యూసర్.

ఇక ఆర్ఆర్ఆర్  సినిమాకి 75 రూపాయల సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం..పదిరోజుల పాటు ధర పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇటీవల ఇచ్చిన జీవో ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మల్టీఫ్లేక్సుల్లో హయ్యెస్ట్ టికెట్ రేటు 250 ఉంది..దానికి ఇపుడు పెంచిన 75 కలుపుకుని 325 రూపాయల వరకూ టికెట్ ధర పెంచుకోవచ్చు.. రాజమౌళి లెక్కలు సమర్పించాక పరిశీలించి 75 రూపాయల టికెట్ ధర పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఈ సినిమాకి హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ రెమ్యునరేషన్‌ కాకుండా..336 కోట్లు ఖర్చయినట్లు ఇటీవల ప్రభుత్వానికి తెలిపింది మూవీ టీమ్. ఈ ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారని… త్వరలోనే ఫైల్ CM జగన్ వద్దకు వెళ్తుందన్నారు మంత్రి పేర్నినాని. అటు ప్రేక్షకులకు  ఇటు నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇక ఈ మూవీ రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా 3 గంటల 6 నిమిషాల 54 సెకండ్ ఉండనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Monal Gajjar: గుచ్చే గులాబీలా కుర్రాళ్ళ గుండెల్లో పూల బాణాలు గుచ్చుతున్న బిగ్ బాస్ బ్యూటీ ‘మోనాల్’…

Sammathame: ప్రేమలో తేలిపోతున్న యంగ్ హీరో.. సమ్మతమే మూవీ నుంచి మరో అందమైన పాట..

Ananya Nagalla: యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో చేరిన హీరోయిన్ ‘అనన్య నాగల్ల’ కొత్త ఫొటోస్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న బ్యూటీ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu