Sammathame: ప్రేమలో తేలిపోతున్న యంగ్ హీరో.. సమ్మతమే మూవీ నుంచి మరో అందమైన పాట..

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విలక్షణమైన సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.

Sammathame: ప్రేమలో తేలిపోతున్న యంగ్ హీరో.. సమ్మతమే మూవీ నుంచి మరో అందమైన పాట..
Kiran Abbavaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 17, 2022 | 6:09 PM

Sammathame: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విలక్షణమైన సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్.. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. హీరోగా మారిన తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీతో హిట్ అందుకున్నాడు. ఇక ఈ కుర్ర హీరోకి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇటీవలే సెబాస్టియన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ కుర్ర హీరో. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా.. కిరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న “సమ్మతమే” అనే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను పెంచాయి. మొదటి సింగిల్ లిరికల్ వీడియో కూడా చార్ట్‌బస్టర్‌గా మారింది.

ఈ రోజు రొమాంటిక్ మెలోడీగా రూపొందిన `బుల్లెట్ లా` లిరికల్ వీడియోను ఆవిష్కరించారు. శేఖర్ చంద్ర త‌న వాద్య‌సంగీతంలో ఆక‌ట్టుకునేలా చేశాడు. కిరణ్, చాందిని ఆకర్ష‌ణీయంగా కనిపిస్తున్నారు. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి డిఫరెంట్ లవ్ స్టోరీతో వచ్చిన ఆయన సంగీతంలో మంచి అభిరుచి ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి సింగిల్ లాగానే ఇది కూడా హిట్‌గా నిలుస్తుంది. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె ప్రవీణ నిర్మించిన “సమ్మతమే” ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ఆ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మే నాకు స్ఫూర్తి.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..

Viral Photo: బూరె బుగ్గల చిన్నారి.. ఎందుకమ్మా అంత కోపం.! ఈ క్యూట్ బుజ్జాయిని గుర్తుపట్టండి..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. టికెట్స్ రేట్స్ విషయంపై..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!