AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nazriya Nazim : అంటే సుందరానికి మూవీ నుంచి నాని ప్రేయసి లుక్ వచ్చేసింది.. ఎంత క్యూట్‌గా ఉందో..

ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు నెక్స్ట్ కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నాడు

Nazriya Nazim : అంటే సుందరానికి మూవీ నుంచి నాని ప్రేయసి లుక్ వచ్చేసింది.. ఎంత క్యూట్‌గా ఉందో..
Nani
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2022 | 6:41 PM

Share

Ante Sundaraniki : ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు నెక్స్ట్ కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్ లో సందడి చేసింది. రాహుల్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకూండా వసూళ్ల పరంగాను లాభాలు తెచ్చిపెట్టింది. శ్రీకాంత్ ఓదెల్ల దర్శకత్వంలో  ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దసరా అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. మొదటి నాని ఈ సినిమా తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఈ సినిమాతో పాటు అంటే సుందరానికి అనే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు ఈ నేచురల్ స్టార్. ఇటీవలే ఈ సినిమానుంచి నాని క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఓ టీజర్ ను వదిలారు.. ఈ టీజర్ ప్రేక్షకుల విపరీతంగా ఆకట్టుకుంది.

అంటే.. సుందరానికీ!” చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘బ్రోచేవారేవరురా’ ‘మెంటల్ మదిలో’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్.. ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది.తాజాగా  ”అంటే.. సుందరానికీ!” చిత్రం నుంచి హీరోయిన్ నజ్రియా లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నాని ఈ సినిమాలో ‘K.P.V.S.S.P.R సుందర ప్రసాద్’ అనే పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

మరిన్ని ఇక్కడ చదవండి :

Monal Gajjar: గుచ్చే గులాబీలా కుర్రాళ్ళ గుండెల్లో పూల బాణాలు గుచ్చుతున్న బిగ్ బాస్ బ్యూటీ ‘మోనాల్’…

Sammathame: ప్రేమలో తేలిపోతున్న యంగ్ హీరో.. సమ్మతమే మూవీ నుంచి మరో అందమైన పాట..

Ananya Nagalla: యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో చేరిన హీరోయిన్ ‘అనన్య నాగల్ల’ కొత్త ఫొటోస్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న బ్యూటీ..