Russia-Ukraine war: ఏటీఎంలలో కనిపించని నోట్లు.. మూతబడిన బ్యాంకులు.. రష్యాలో ఆర్ధిక విధ్వంసం..
Economy War: ఎటు చూసినా వినాశనమే.. ఉక్రేనియన్ల హాహాకారాలు.. ఆర్తనాదాలతో హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. 23 రోజులుగా భీకర దాడులతో ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది రష్యా. అయితే..
ఎటు చూసినా వినాశనమే.. ఉక్రేనియన్ల హాహాకారాలు.. ఆర్తనాదాలతో హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. 23 రోజులుగా భీకర దాడులతో ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది రష్యా. అయితే ఈ యుద్ధంతో రష్యా కూడా కుదేలైపోతోంది. ఆ దేశాన్ని సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టుముడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ప్రపంచ దేశాల ఆంక్షల ధాటికి ఆర్థికంగా సతమతమవుతోంది రష్యా. ప్రపంచ దేశాల ఆర్థిక ఆంక్షలు రష్యన్ల రోజువారీ జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్విఫ్ట్ నుంచి రష్యా బ్యాంకులను తొలగించడంతో.. విదేశీ సెంట్రల్ బ్యాంకుల్లో రష్యా విదేశీ మారకద్రవ్య నిల్వలు స్తంభించిపోయాయి. రూబుల్‌ను విదేశీ కరెన్సీగా మార్చుకోలేకపోతున్నారు. చెల్లింపు వ్యవస్థలన్నీ నిలిచిపోయాయి. ఏటీఎంల నుంచి డబ్బులు రావడంలేదు. బ్యాంకుల కార్డులు పనిచేయడం లేదు.
బ్యాంకుల్లో డిపాజిట్ చేయడమూ కష్టంగానే మారింది. మాస్టర్‌కార్డ్, వీసా క్రెడిట్ కార్డులు పనిచేయకపోవడంతో జనం డబ్బుకు కటకటలాడుతున్నారు. మరోవైపు విదేశీ కంపెనీలు కార్యాలయాలు, వ్యాపారాలు మూసేసి వెళ్లిపోతున్నాయి. దీంతో ఉపాధి కోల్పోయి వేలాది మంది రష్యన్లు రోడ్డున పడ్డారు. మరోవైపు విదేశీ సంస్థలు సైతం తమ ఉత్పత్తుల్ని రష్యాలో విక్రయించకూడదని నిర్ణయించాయి.
దీంతో నిత్యావసరాలకూ కొరత ఏర్పడటంతో ధరలు కొండెక్కాయి. 50నుంచి100 శాతం వరకు రేట్స్ పెరిగిపోయాయి. భారీగా పెరిగిపోయిన ధరలతో నిత్యావసరాలను కొనుగోలు చేయలేక నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. మరోవైపు మెడిసిన్స్‌కూ కొరత ఏర్పడింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న పరిస్థితులతో..విదేశీ విద్యార్థులంతా దేశం విడిచి వెళ్లిపోతున్నారు.
రష్యా రూబుల్ విలువ 10 శాతానికి పైగా క్షీణించింది. ఇప్పటికే రష్యా కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేట్లను 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. దీని వల్ల జనజీవన ప్రమాణాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.
ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.
Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..