Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..

Black Salt Health Benefits: భారతీయుల వంటగది కేవలం వండివార్చాడానికి మాత్రమే కాదు..ఇది అనేక ఔషధాల నిలయం. మన వంటగదిలో ఇలాంటి అనేక వస్తువులు ఉన్నాయి.

Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..
Black Salt Health Benefits
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 17, 2022 | 1:11 PM

భారతీయుల వంటగది కేవలం వండివార్చాడానికి మాత్రమే కాదు..ఇది అనేక ఔషధాల నిలయం. మన వంటగదిలో ఇలాంటి అనేక వస్తువులు ఉన్నాయి. ఇవి మనను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంటాయి. మన వంటగదిలో ఉంచిన వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలాసార్లు మనకు తెలియదు. అటువంటి వాటిలో నల్ల ఉప్పు(Black Salt) కూడా ఒకటి. అంతే కాదు..  నల్ల ఉప్పు ద్రావణం ఊబకాయాన్ని దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. నల్ల ఉప్పులో 80 రకాల ఖనిజాలు, మన శరీరానికి అవసరమైన అనేక సహజ మూలకాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు కలిపి తాగడం వల్ల నియంత్రణ లేని రక్తపోటు.. షుగర్ వంటి అనేక వ్యాధులు నయమవుతాయి. ఒక గ్లాసు నిండుగా గోరువెచ్చని నీటిలో మూడింట ఒక వంతు నల్ల ఉప్పు కలపండి. బ్లాక్ సాల్ట్ కలిపిన తర్వాత పైన గ్లాస్ కవర్ చేసి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. కాసేపటి తర్వాత ఆ నీటిలో మరికొంత నల్ల ఉప్పు వేయాలి. తర్వాత కలిపిన నల్ల ఉప్పు నీటిలో కరగకుండా చూస్తారు. ఇది నీటిలో కరగకపోతే మీ పరిష్కారం త్రాగడానికి సిద్ధంగా ఉంది.

శరీరంలో ఉండే..

నల్ల ఉప్పును వాడడం వల్ల శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నల్ల ఉప్పును కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే ఫలితం కనిపిస్తుంది.

ఊబకాయాన్ని నియంత్రించడంలో..

నల్ల ఉప్పు, గోరువెచ్చని నీటి ద్రావణం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని కణాలకు పోషణను అందిస్తుంది, ఇది ఊబకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

చర్మ సమస్య నుండి బయటపడండి

నల్ల ఉప్పులో ఉండే క్రోమియం మొటిమలను తగ్గించేందుకు సహాయపడుతుంది. సల్ఫర్ చర్మంలోని మురికిని క్లియర్ చేయడంతోపాటు మృదువుగా చేస్తుంది. ఈ నీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎగ్జిమా, దద్దుర్లు సమస్య కూడా దూరమవుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరచడంలో ..

ఉప్పునీరు నోటిలోని లాలాజల గ్రంథిని సక్రియం చేయడానికి సహాయపడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఈ గ్రంథి చాలా మేలు చేస్తుంది. ఇందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్, ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్‌లను ప్రేరేపించడంలో కూడా సహాయపడుతుంది. దీంతో తిన్న ఆహారం విచ్ఛిన్నమై తేలికగా జీర్ణమవుతుంది.

ఇది కాకుండా పేగు, కాలేయంలోని ఎంజైమ్‌లు కూడా ప్రేరేపించబడటానికి సహాయపడతాయి. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. ఇది మీకు ఎసిడిటీ నుంచి ఉపశమనం కూడా ఇస్తుంది.

నిద్రపోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది

నల్ల ఉప్పులో ఉండే మినరల్స్ మన నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి. ఇది కార్టిసాల్, అడ్రినలిన్ వంటి రెండు ప్రమాదకరమైన ఒత్తిడి హార్మోన్ల ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. దీని కారణంగా ఇది మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది.

షుగర్‌ పేషెంట్లకు..

షుగర్‌ పేషెంట్లకు నల్ల ఉప్పు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల వారి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు.

జీర్ణ సమస్యలు రాకుండా..

చిన్నారులకు నల్ల ఉప్పు ఎంతగానో మేలు చేస్తుంది. వారిలో అజీర్ణం సమస్యను తగ్గిస్తుంది. రోజూ పిల్లలకు ఆహారంలో నల్ల ఉప్పును ఇవ్వాలి. దీంతో వారిలో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్..

Nail Biting Habit: మీకు కూడా గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఈ అలవాటును ఎలా వదిలించుకోవాలో తెలుసా..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..