Chia Seeds Benefits: చియా విత్తనాలతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు….

చియా విత్తనాలు (Chia Seeds).. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా..శరీరాన్ని ఫిట్‏గా ఉంచడంలోనూ సహాయపడతాయి.

Chia Seeds Benefits: చియా విత్తనాలతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు....
Chia
Follow us

|

Updated on: Mar 18, 2022 | 7:27 AM

చియా విత్తనాలు (Chia Seeds).. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా..శరీరాన్ని ఫిట్‏గా ఉంచడంలోనూ సహాయపడతాయి. అంతేకాకుండా.. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు.. చియా విత్తనాలను జ్యూస్‏గా లేదా.. సలాడ్‏గా తీసుకోవచ్చు. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‏ను బర్న్ చేయడంలోనూ సహయపడుతాయి. పీచు, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే చియా విత్తనాలలో పోషకాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెకు.. పేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహయపడతాయి. అలాగే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక విధాలుగా సహయపడడమే కాకుండా.. ప్రమాధకర వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

చియా విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు.. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. చియా గింజలు శరీరానికి అమైనో ఆమ్లాలు అందుతాయి. ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహయపడతాయి. అలాగే ఈ చియా విత్తనాలు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి కణాలు.. ప్రోటీన్స్, డీఎన్ఏ దెబ్బతినే ప్రీ రాడికల్స్ తో పోరాడతాయి. ప్రీ రాడికల్స్ కాకుండా.. చియా విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మూలకాలు చర్మం, ఆరోగ్యం, జుట్టుకు మేలు చేస్తాయి.

అలాగే ఇవి రక్తపోటును తగ్గించడంలో సహయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడతాయి. మధుమేహం.. రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక గుండె జబ్బులు, క్యాన్సర్.. అంతర్గత మంటలను తగ్గించడంలోనూ సహయపడతాయి. చియా విత్తనాల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‏లు ఉండడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. నివేదికల ప్రకారం.. పాల ఉత్పత్తుల కంటే చియా గింజలు శరీరంలో ఎక్కువ కాల్షియంను తయారు చేస్తాయి.

చియా విత్తనాల్లో పెరుగు, కూరగాయాలతో కలిసి తీసుకోవచ్చు. దీనిని స్మూతీస్ చేయడానికి ఉపయోగిస్తారు. పాలలో రాత్రంతా నానబెట్టిన చియా గింజలు.. ఉదయానికి మృదువుగా మారతాయి. ఈ పాలను తాగడం వలన ఆరోగ్యానికి మంచిది. అలాగే పిండితో కలిపి రోటీని తయారు చేసుకోవచ్చు.

గమనిక :- ఈ కథనం కేవలం నివేదికలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా.. నిపుణల సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. సందేహాలకు ముందుగా వైద్యులను సంప్రదించాలి.

Also Read: Andhra: ఏపీలో ‘RRR’ సినిమా టికెట్స్ రేట్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉండనున్నాయ్ అంటే..?

HanuMan: శరవేగంగా హను-మాన్ మూవీ షూటింగ్.. సూపర్ హీరోగా కనిపించనున్న తేజ

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో

Nazriya Nazim : అంటే సుందరానికి మూవీ నుంచి నాని ప్రేయసి లుక్ వచ్చేసింది.. ఎంత క్యూట్‌గా ఉందో..

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.