Health Tips: ఈ గింజలని విసిరేయకండి.. వాటి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Health Tips: కొన్ని పండ్లు, కూరగాయల విత్తనాలు మీ ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పవచ్చు. చాలా మంది వీటి విలువ తెలియక పారేస్తారు. ఇందులో అద్భుతమైన పోషకాలు దాగి ఉంటాయి.

Health Tips: ఈ గింజలని విసిరేయకండి.. వాటి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Seeds
Follow us
uppula Raju

|

Updated on: Mar 18, 2022 | 5:51 AM

Health Tips: కొన్ని పండ్లు, కూరగాయల విత్తనాలు మీ ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పవచ్చు. చాలా మంది వీటి విలువ తెలియక పారేస్తారు. ఇందులో అద్భుతమైన పోషకాలు దాగి ఉంటాయి. ఫైబర్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఏదైనా వంటకంలో చేర్చవచ్చు. ఈ గింజలని చెత్తకుండీలో వేసే బదులు ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే చాలా బెటర్. అందులో మొదట చెప్పుకోవాల్సింది గుమ్మడికాయ గింజలు. వీటిని చాలా మంది పారవేస్తారు. కానీ ఈ విత్తనాలలో చాలా పోషకాలు ఉంటాయి. కొవ్వు, విటమిన్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. గుమ్మడికాయ గింజలను పచ్చిగా తినవచ్చు కానీ కాల్చిన గింజలు మరింత రుచికరంగా ఉంటాయి. అంతే కాకుండా బొప్పాయి గింజలలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. కొన్ని వ్యాధులకి చికిత్స చేయడంలో ఉపయోగిస్తారు. ఇవి ఒత్తిడిని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. బొప్పాయి గింజల్లో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. మీరు బొప్పాయి గింజలను పచ్చిగా తినవచ్చు. కానీ వాటిని తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి ఘాటైన వాసన కలిగి ఉంటాయి.

ఇది కాకుండా చింతపండు గింజలు కూడా ఆరోగ్యానికి మంచిదని ఎన్న పరిశోధనలలో రుజువైంది. ఈ విత్తనాలు మీ గుండె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా దంతాలకు కూడా మేలు చేస్తాయి. అంతే కాదు వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. కొంతమంది పెద్దలు ఇప్పటికి వీటిని కాల్చుకొని తింటారు. ఇవి కీళ్ల నొప్పులని కూడా దూరం చేస్తాయి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Pensioners: పెన్షనర్లు అలర్ట్‌.. ఆ సర్టిఫికెట్‌లో తప్పులుంటే పెన్షన్ ఆగిపోతుంది..!

Holi 2022: సేంద్రియ రంగులతో హోలీ ఆడండి.. పర్యావరణాన్ని కాపాడండి..

Holi 2022: విచిత్ర సంప్రదాయం.. హోలీ రోజు కొత్త అల్లుడిని గుర్రంపై ఊరేగిస్తారు..!