Holi 2022: విచిత్ర సంప్రదాయం.. హోలీ రోజు కొత్త అల్లుడిని గుర్రంపై ఊరేగిస్తారు..!

Happy Holi 2022: హోలీ భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఈ పండుగని రంగుల పండుగ అని పిలుస్తారు. ఈ రోజున ప్రజలు ఒకరికొకరు

Holi 2022: విచిత్ర సంప్రదాయం.. హోలీ రోజు కొత్త అల్లుడిని గుర్రంపై ఊరేగిస్తారు..!
Donkey Ride
Follow us
uppula Raju

|

Updated on: Mar 17, 2022 | 10:51 PM

Happy Holi 2022: హోలీ భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఈ పండుగని రంగుల పండుగ అని పిలుస్తారు. ఈ రోజున ప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకుంటారు. వివిధ రకాల వంటకాలతో మంచి విందు చేసుకుంటారు. అయితే హోలి సందర్భంగా చాలా ప్రాంతాలలో వింతైన ఆచారాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా నృత్యం చేయడం, ఆటలు ఆడటం వంటివి ఉంటాయి. అలాగే ఒక ప్రాంతంలో గ్రామానికి చెందిన కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగిస్తారు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని విదా గ్రామంలో వింతైన సంప్రదాయం ఉంది. హోలి పండుగ సందర్భంగా గ్రామంలోని కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగిస్తారు. అతడిని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తారు. అంతే కాదు గాడిద ఎక్కిన కొత్త అల్లుడికి బంగారు ఉంగరం, కొత్త దుస్తులని బహుమతిగా ఇవ్వడం సంప్రదాయం.

మొదటగా ఈ ఊరి ప్రజలు హోలీకి మూడు, నాలుగు రోజుల ముందు కొత్త అల్లుడి కోసం వెతుకుతారు. ఎంపికైన వ్యక్తికి నచ్చిన దుస్తులను అందిస్తారు. అనంతరం గాడిదని అందంగా అలంకరించి పూలమాల వేస్తారు. దానిపై కూర్చోబెట్టి ఊరంతా ఊరేగిస్తారు. ఆ సమయంలోనే అతడికి బంగారు ఉంగరం లాంటి వస్తువులు బహుమతిగా అందిస్తారు. ఈ గాడిద సవారీ ఊరి మధ్య నుంచి ప్రారంభమై 11 గంటలకు హనుమాన్ దేవాలయం వద్ద ముగుస్తుంది. చివరకి అతడిని ఆలయానికి తీసుకువెళ్లి హారతినివ్వడంతో ఈ తతంగం ముగుస్తుంది. వాస్తవానికి ఈ సంప్రదాయం గ్రామంలోని వ్యక్తి ఆనందరావు దేశ్‌ముఖ్ అల్లుడుతో ప్రారంభమైంది. ఎందుకంటే అతడు హోలీ రోజు రంగులు ఆడేందుకు నిరాకరిస్తున్నాడని గ్రామస్థులందరు కలిసి గాడిదపై ఊరేగించారు. ఆ తర్వాత ఈ సంప్రదాయం తరతరాలుగా ఇలాగే కొనసాగుతోంది.

Gangapayala Aaku: ఈ మొక్క కనిపిస్తే పిచ్చి మొక్క అనుకోకండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

Pegasus: రూ.25 కోట్లకే నాకు ‘ఆఫర్’.. అప్పట్లో ఏపీ సర్కార్ కొనుగోలు చేసింది.. ‘పెగాసస్’పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

Rupee: అమెరికా డాలర్‌తో పోల్చితే భారత్, పాకిస్థాన్ కరెన్సీ విలువ ఎంత?