Pegasus: రూ.25 కోట్లకే నాకు ‘ఆఫర్’.. అప్పట్లో ఏపీ సర్కార్ కొనుగోలు చేసింది.. ‘పెగాసస్’పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్'పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మమతా మాట్లాడుతూ, 'పెగాసస్' తయారు చేసే సైబర్ సెక్యూరిటీ కంపెనీ 4-5 సంవత్సరాల క్రితం రాష్ట్ర పోలీసులను ఆశ్రయించిందని అన్నారు.
Mamata Banerjee on Pegasus: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్’పై పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మమతా మాట్లాడుతూ, ‘పెగాసస్’ తయారు చేసే ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ(Israeli Spyware Company) 4-5 సంవత్సరాల క్రితం రాష్ట్ర పోలీసులను ఆశ్రయించిందని అన్నారు. వివాదాస్పద ఇజ్రాయెలీ స్పైవేర్‌ను కేవలం రూ. 25 కోట్లకు సరఫరా చేస్తామని చెప్పారన్నారు. దానిని తిరస్కరించామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పైవేర్‌ను కొనుగోలు చేసి, దేశ భద్రత కోసం ఉపయోగించకుండా న్యాయమూర్తులు, అధికారులపై రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించిందని మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్ర సెక్రటేరియట్‌లో మమతా బెనర్జీ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. NSO, పెగాసస్ తయారీదారు తమ వస్తువులను విక్రయించడానికి ప్రతి ఒక్కరినీ సంప్రదించారు. నాలుగు-ఐదేళ్ల క్రితం కూడా మన పోలీసులను ఆశ్రయించి రూ.25 కోట్లకు అమ్ముతామన్నారు. నాకు సమాచారం రాగానే మాకు అవసరం లేదని చెప్పాను. ప్రజల గోప్యత దెబ్బతింటుందని, దానిని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఆమె అన్నారు.
কেন্দ্র রাজ্যের টাকাই রাজ্যকে ফিরিয়ে দেয় তাই, এই পাওনা থেকে দিদি কিছুতেই রাজ্যকে বঞ্চিত হতে দেবেন না। pic.twitter.com/hDCs7gfGb7
— Banglar Gorbo Mamata (@BanglarGorboMB) March 17, 2022
ఇది దేశ ప్రయోజనాల కోసం లేదా భద్రత కోసం ఉపయోగించినట్లయితే, అది పూర్తిగా భిన్నమైన విషయం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం, న్యాయమూర్తులు, అధికారులపై ఉపయోగిసతున్నారన్నారు. ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఈ వాదనను ఖండించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాంటి కొనుగోళ్లు చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న లోకేశ్, మమతా బెనర్జీ వాదనపై మాట్లాడుతూ, “ఆమె నిజంగా అలా అన్నారో లేదో నాకు తెలియదు. అయితే, ఎక్కడ, ఏ సందర్భంలో ఆమె అలా మాట్లాడినట్లయితే, ఖచ్చితంగా ఆమెకు తప్పుడు సమాచారం అందించారన్నారు. పెగాసస్ తన స్పైవేర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా విక్రయించడానికి ఆఫర్ చేసింది. అయితే మేము దానిని తిరస్కరించామని లోకేష్ చెప్పారు.
Read Also….