Pensioners: పెన్షనర్లు అలర్ట్.. ఆ సర్టిఫికెట్‌లో తప్పులుంటే పెన్షన్ ఆగిపోతుంది..!
Pensioners: ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికీ జీవించే ఉన్నామని రుజువుగా బ్యాంకులు,
Pensioners: ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికీ జీవించే ఉన్నామని రుజువుగా బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీలకు లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి. అయితే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ తిరస్కరణకు గురైతే వెంటనే పెన్షన్ పంపిణీ ఏజెన్సీ లేదా బ్యాంకును సంప్రదించండి. సర్టిఫికేట్ ఎందుకు తిరస్కరించారో తెలుసుకోండి. ఇచ్చిన సమాచారంలో ఏదైనా తేడా ఉంటే వెంటనే కొత్త జీవన్ ప్రమాణ్ IDని పొందండి. అలా చేయడంలో విఫలమైతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. పెన్షనర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను ప్రారంభించింది. వృద్ధులు లేదా వికలాంగులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. కరోనా కాలంలో ఈ పద్దతిని ప్రారంభించారు. అయితే అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే జరుగుతుండటంతో ఒక్కోసారి కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ తిరస్కరణకు గురికావొచ్చు. అటువంటి పరిస్థితిలో మీ పెన్షన్ ఆగిపోతుంది.
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ తిరస్కరణకు గురైతే వెంటనే పెన్షన్ పంపిణీ ఏజెన్సీని సంప్రదించాలి. మీ సమస్యను ఏజెన్సీకి నివేదించాలి. సర్టిఫికేట్‌లో ఇచ్చిన తప్పుడు సమాచారం కారణంగా అది తిరస్కరణకు గురికావొచ్చు. ఈ పరిస్థితిలో వెంటనే మీరు కొత్త జీవన్ ప్రమాణ్ లేదా ప్రమాణ్-ID కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ IDలో మొత్తం సమాచారాన్ని నింపాలి. బయోమెట్రిక్ వివరాలను అందించాలి. వీలైనంత త్వరగా ఈ పని చేయాలి. ఎందుకంటే ఈ ID సిద్ధమైన తర్వాత మాత్రమే జీవన్ ప్రమాణ్‌కు సంబంధించిన పని జరుగుతుంది. తద్వారా మీ పెన్షన్ విడుదల చేస్తారు.
పదవీ విరమణ పొందిన వారు జీవితాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం ఇటీవల ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రారంభించింది. దీని వల్ల ప్రభుత్వానికి చెందిన 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. వారు ఇప్పుడు మొబైల్ యాప్‌ను ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. కానీ కొన్ని విషయాలను మాత్రం గుర్తించుకోవాలి. ఏంటంటే ఒక సారి పెన్షన్ సర్టికేట్ సమర్పించినట్లయితే అది సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటుంది.