- Telugu News Photo Gallery Viral photos 11 year old iceland boy buys land in scotland do you know the reason
Viral Photos: పదకొండేళ్ల పిల్లాడు తన పేరుపై భూమిని కొన్నాడు.. కారణం ఏంటో తెలుసా..?
Viral Photos: ప్రపంచంలో చాలామంది భూమి కొని ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. కానీ చాలామందికి ఈ కోరిక నెరవేరదు. కారణం భూమి ధర బంగారం కంటే ఎక్కువగా ఉంది.
Updated on: Mar 17, 2022 | 12:55 AM

ప్రపంచంలో చాలామంది భూమి కొని ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. కానీ చాలామందికి ఈ కోరిక నెరవేరదు. కారణం భూమి ధర బంగారం కంటే ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో చాలా మందికి ఈ కల కలగానే మిగిలిపోతుంది. కానీ 11 ఏళ్ల వయసులోనే ఓ బాలుడు భూమిని కొనుగోలు చేశాడు. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఈ 11 ఏళ్ల చిన్నారి పేరు ఆర్నాల్దుర్ క్జార్ ఆర్నోర్సన్. ఇతను ఐస్‌లాండ్‌కు చెందినవాడు. అతడు భూమిని కొనుగోలు చేయడం వెనుక చాలా ఆసక్తికరమైన కారణం ఉంది. దాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఈ బాలుడి కోరిక ఏంటంటే అందరు ఇతడిని లార్డ్ అని పిలవాలని కోరుకునేవాడు. లార్డ్ అంటే ప్రభువు అని అర్థం. స్కాట్లాండ్ భూమి కొని తన రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. అందరు తనను రాజుగా భావించాలని అనుకునేవాడు.

ఆర్నాల్డర్ ఫిబ్రవరిలోనే భూమిని కొనుగోలు చేశాడు. ఎందుకంటే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా భూమి కొంటే 80 శాతం రాయితీ ఉందని తెలుసుకొని తండ్రితో మాట్లాడి భూమిని కొనుగోలు చేశాడు.

ఆ బాలుడి కోరిక ఎలా ఉన్నా.. అక్కడి ప్రజలు పిల్లవాడిని ప్రభూ అని పిలుస్తారా లేదా అనేది భవిష్యత్‌లో తెలుస్తుంది.



