Hiccup Relief: ఎక్కిళ్లు ఎందుకు వస్తాయో తెలుసా? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం..
ఎక్కిళ్ళు ఎవరూ ఊహించని విధంగా సడెన్‌గా వస్తాయి. అయితే ఓ పట్టాన ఇవి ఆగవు. చిరాకు తెప్పిస్తాయి. పైగా అందరి ముందు ఇలా ఆగకుండా ఎక్కిళ్లు వస్తే కాస్త సిగ్గుపడటం కూడా అనివార్యం. అయితే సహజంగా ఎక్కిళ్లను పోగొట్టడానికి ఏం చేయాలో చాలా మందికి తెలియదు. కొంతమంది ఎక్కిళ్ళు వచ్చిన వెంటనే నీళ్లు..

ప్రతి ఒక్కరికీ ఎక్కిళ్ళు వస్తాయి. ఈ ఎక్కిళ్ళు ఎవరూ ఊహించని విధంగా సడెన్‌గా వస్తాయి. అయితే ఓ పట్టాన ఇవి ఆగవు. చిరాకు తెప్పిస్తాయి. పైగా అందరి ముందు ఇలా ఆగకుండా ఎక్కిళ్లు వస్తే కాస్త సిగ్గుపడటం కూడా అనివార్యం. అయితే సహజంగా ఎక్కిళ్లను పోగొట్టడానికి ఏం చేయాలో చాలా మందికి తెలియదు. కొంతమంది ఎక్కిళ్ళు వచ్చిన వెంటనే నీళ్లు తాగుతారు. మరికొందరు నోటిలో చక్కెర వేసుకుంటారు. అసలింతకూ ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? దానికి కారణం ఏమిటి? వీటిని చిటికెలో తగ్గించడానికి ఏ చిట్కాలను అనుసరించాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా?
ఎక్కిళ్ళు చాలా సాధారణం. అవి శరీరంలోని డయాఫ్రాగమ్ కండరాల సమస్యల వల్ల సంభవిస్తాయి. ఇది మన శ్వాసకు సంబంధించినది. ఈ కండరం అకస్మాత్తుగా సంకోచించినప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి. కానీ ఎక్కిళ్ళు రావడానికి ఇది ఒక్కటే కారణం కాదు. ఎక్కిళ్ళు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా త్వరగా ఆహారం తినడం లేదా చాలా త్వరగా నీరు త్రాగడం వల్ల కడుపులోకి చాలా గాలి ప్రవేశిస్తుంది. సోడా, బీర్ వంటి అధిక కార్బోనేటేడ్ పానీయాలు తాగడం వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తాయి. అలాగే చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఒకేసారి తినడం వల్ల ఎక్కిళ్ళు వస్తాయి. అలాగే కారంగా ఉండే ఆహారాలు తినడం, ధూమపానం చేయడం, ఒత్తిడి, ఆందోళనతో బాధపడటం వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తుంటాయి.
ఎక్కిళ్ళు తగ్గించడానికి చిట్కాలు
- ఎక్కిళ్ళు తగ్గాలంటే నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి.
- చల్లటి నీరు తాగడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి.
- ఎక్కిళ్ళు త్వరగా తగ్గడానికి నోటిలో కొంచెం చక్కెర వేసుకుని నెమ్మదిగా నమిలినా తగ్గుతాయి.
- అన్నం తినడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి.
- ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవడం, అలాగే కొన్ని సెకన్ల పాటు శ్వాసను పట్టుకోవడం వల్ల కూడా ఎక్కిళ్లను నియంత్రించవచ్చు.
- నోటిలో ఐస్ క్యూబ్ పెట్టుకుని నెమ్మదిగా నమలడం వల్ల ఎక్కిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- వెల్లుల్లి రెబ్బ తినడం లేదా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తాగడం వల్ల కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.