AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair on Ears: మీకూ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా? అయితే మీరు బూరెల బుట్టలో పడ్డట్లే..

అబ్బాయిలకు సహజంగానే ఇలా వెంట్రుకలు వస్తుంటాయి. మరి కొంతమంది పురుషుల ఛాతీపై దట్టంగా వెంట్రుకలు పెరుగుతాయి. అయితే కొంతమంది చెవులపై కూడా వెంట్రుకలు పెరగడం మీరుచూసే ఉంటారు. సాధారణంగా ఇది హార్మోన్ల వల్ల జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ సాముద్రిక శాస్త్రంలో దానికి అర్థం వేరే ఉందట..

Hair on Ears: మీకూ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా? అయితే మీరు బూరెల బుట్టలో పడ్డట్లే..
Hair On Ears
Srilakshmi C
|

Updated on: Jun 11, 2025 | 1:10 PM

Share

హార్మోన్ల మార్పుల వల్ల ముతిపై, గడ్డంపై అమ్మాయిలకు అవాంఛిత రోమాలు పెరుగుతుంటాయి. అదే అబ్బాయిలకు సహజంగానే ఇలా వెంట్రుకలు వస్తుంటాయి. మరి కొంతమంది పురుషుల ఛాతీపై దట్టంగా వెంట్రుకలు పెరుగుతాయి. అయితే కొంతమంది చెవులపై కూడా వెంట్రుకలు పెరగడం మీరుచూసే ఉంటారు. సాధారణంగా ఇది హార్మోన్ల వల్ల జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ సాముద్రిక శాస్త్రంలో దానికి అర్థం వేరే ఉంది. శాస్త్రాల ప్రకారం ఇది ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రతిబింబిస్తుందట. అదృష్టం, దురదృష్టం, ప్రవర్తన, వ్యక్తిత్వం, భవిష్యత్తు వంటి వివరాలు దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతుంది.

చెవిలో వెంట్రుకలు ఉంటే దాని అర్థం ఏమిటంటే?

ఎవరికైనా చెవులపై వెంట్రుకలు ఉంటే.. ఇది దీర్ఘాయువు, మంచి ఆరోగ్యానికి సంకేతమని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. దీని ప్రకారం ఒక వ్యక్తి చెవులపై సహజంగానే పొడవాటి, మందపాటి వెంట్రుకలు పెరిగితే అది శుభ సంకేతం. చెవులపై వెంట్రుకలు పెరిగితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్షు కలిగి ఉంటాడని చెబుతారు. మంచి ఆరోగ్యంతో ఉంటారని కూడా చెబుతారు.

ప్రశాంతంగా, గంభీరంగా ఉండే వ్యక్తులు

చెవుల పైన వెంట్రుకలు ఉన్న వ్యక్తులు స్వతహాగా ప్రశాంతంగా, గంభీరంగా, ఆలోచనాత్మకంగా ఉంటారు. వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. అలాంటి వ్యక్తుల ఆలోచనలు ఇతరులకు భిన్నంగా ఉంటాయి. ఈ వ్యక్తులు తమను తాము మాత్రమే నమ్ముతారు. ఇతరులకు ఖచ్చితమైన సలహాలు ఇస్తుంటారు.

ఆధ్యాత్మిక చింతన

సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవుల్లో వెంట్రుకలు ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతారు.

సంపద – శ్రేయస్సు

సాముద్రిక శాస్త్రం ప్రకారం, చెవులపై వెంట్రుకలు పెరగడం సంపద, శ్రేయస్సుకు సంకేతంగా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవులపై వెంట్రుకలు ఉన్నవారు జీవితంలో కష్టపడి పనిచేసేవారు, శ్రద్ధగలవారు. అలాంటి వ్యక్తులు క్రమంగా ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. కాలక్రమేణా మంచి శ్రేయస్సును సాధిస్తారు.

జ్ఞానం

సాముద్రిక శాస్త్రం ప్రకారం, చెవిపై ఉన్న వెంట్రుకలు ఆ వ్యక్తి లోతైన జ్ఞానానికి సంకేతం. అలాంటి వ్యక్తులు గంభీరంగా, ఆలోచనాపరులుగా ఉంటారు. జీవితంలోని లోతైన అంశాలను అర్థం చేసుకోగలుగుతారు.

గమనిక: చెవులపై వెంట్రుకలు ఉండటం సాధారణంగా శుభప్రదంగా భావించినప్పటికీ, ఈ వెంట్రుకలు చాలా మందంగా, చిక్కుగా లేదా అసాధారణంగా కనిపిస్తే అది మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత లేదా మరేదైనా ఇతర ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. అటువంటి వారు వైద్య సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.