- Telugu News Photo Gallery Do you know these secret features in WhatsApp? Keep your data safe with these
Whatsapp: వాట్సాప్‌లో ఈ సీక్రెట్ ఫీచర్స్ తెలుసా.? వీటితో మీ డేటా సేఫ్..
ప్రస్తుతం వాట్సాప్ అందరి జీవితంలో భాగం అయిపోయింది. దీని ద్వారానే అన్ని పనులు జరిగిపోతున్నాయి. అయితే డేటా విషయంలో చాలామందికి భయం ఉంది. ఐంతే వాట్సాప్‌ను ప్రత్యేకంగా చేసే అత్యుత్తమ ఫీచర్లు ప్రయత్నించారా? వీటితో మీ సమాచారం అంత సురక్షితంగా ఉంటుంది. మరి ఆ సీక్రెట్ ఫీచర్ ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Jun 11, 2025 | 1:15 PM

వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత, కొంత సమయం తర్వాత మీ చాట్ సందేశాలు ఆటోమేటిక్‌గా అదృశ్యమవుతాయి. ఈ ఫీచర్ ఫైరసీకి చాలా మంచిది. మీ డాటాను ఎవ్వరు దొంగలించలేరు. అలాగే స్పై చేయలేరు.

ఇప్పుడు మీరు ఒకే చోట బహుళ గ్రూపులను జోడించడానికి కమ్యూనిటీ ఫీచర్ అందుబాటులో ఉంది. దీంతో పాఠశాల, కార్యాలయం, సొసైటీ సమూహాలను కలిసి నిర్వహించడం ఇప్పుడు సులభంగా మారుతుంది.

ఇప్పుడు మీరు వాయిస్ మెసేజ్ పంపే ముందు వినవచ్చు. పొరపాటున వాయిస్ మెసేజ్ పంపినందుకు ఇక పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పంపిన సందేశాన్ని 15 నిమిషాల్లోనే సవరించవచ్చు. టైపోల టెన్షన్ ముగిసింది.

ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఫీచర్ ఇప్పుడు వాట్సాప్‌లో కూడా వచ్చింది. మీ స్టేటస్‌పై యాడ్ యువర్స్ స్టిక్కర్‌ను ఉంచడం ద్వారా మీరు మీ స్నేహితులను ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆహ్వానించవచ్చు. ఇది స్టిక్కర్ ప్రియులకు నచ్చుతుంది.





