AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peanut Burfi: బర్ఫీ అంటే ఇష్టమా.. జీడిపప్పు, బాదాం లేదా.. వేరుశనగతో బర్ఫీని తయారు చేసుకోండి.. రెసిపీ

కొంత మందికి తినే ఆహారంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా స్వీట్స్ తినేవారు ఎక్కువగా జీడిపప్పుతో చేసిన బర్ఫీని ఎంపిక చేసుకుంటారు. ఈ ఖరీదైన స్వీట్ ని అందరూ కొనుక్కోలేరు. తయారు చేసుకోలేరు. అయితే ఇంట్లో జీడిపప్పు, బాదం వంటి ఖరీదైన డ్రై ఫ్రూట్స్ లేకపోయినా రుచికరమైన బర్ఫీని చేరుకోవచ్చు. దీనికి కావాల్సింది వేరుశనగలు.. ఈ రోజు వేరుశనగ బర్ఫీ రెసిపీ తెలుసుకుందాం..

Peanut Burfi: బర్ఫీ అంటే ఇష్టమా.. జీడిపప్పు, బాదాం లేదా.. వేరుశనగతో బర్ఫీని తయారు చేసుకోండి.. రెసిపీ
Peanut Katli
Surya Kala
|

Updated on: Jun 11, 2025 | 12:47 PM

Share

భారతీయులు ఆహార ప్రియులు. అనేక రకాల ఆహారాలు తింటారు. కారంగా ఉండే ఆహారాల నుంచి సహజ పానీయాల వరకు అనేక రకాల వంటకాలను ఇంట్లోనే తయారు చేసుకుంటారు. రుచికరమైన, ఆరోగ్యాన్ని ఇచ్చే వీటిని ఇంట్లో ప్రతి ఒక్కరూ వాటిని ఎంతో ఉత్సాహంగా తింటారు. అయితే స్వీట్స్ అంటే ఇష్టమైన వారు వీటిని తయారు చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఓపిక కూడా ఉండాలి.. అప్పుడే మీకు నచ్చిన స్వీట్ ని తయారు చేసుకోగలుగుతారు.

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో రకరకాల ఆహార పదార్ధాల తయారీ వీడియోలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సాధారణంగా జీడిపప్పు బర్ఫీని అందరూ ఇష్టంగా తింటారు. కానీ ఇంట్లో చేసుకోవడం అంటే కొంచెం కష్టం. ఎందుకంటే జీడిపప్పు చాలా ఖరీదైనది. అటువంటి పరిస్థితిలో స్వీట్ అంటే ఇష్టపడేవారు జీడిపప్పుకు బదులుగా వేరుశెనగని ఉపయోగించి కట్లీని కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పెద్దగా ఖర్చు కూడా కాదు. ఎప్పుడు మనసుకి స్వీట్ తినలనిపిస్తే అప్పుడు ఈ వేరుశనగ బర్ఫీని తయారు చేసుకోవచ్చు. ఇంటికి అతిథులు వచ్చినా లేదా చిన్న పార్టీ జరిగినా, ప్రతి సందర్భంలోనూ దీనిని చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టపడతారు. టేస్ట్ చూసిన వారు తప్పనిసరిగా ప్రశంసిస్తారు. ఈ రోజు వేరుశెనగ కట్లీ తయారీ రెసిపీని కుక్ విత్ పరుల్ అనే ఖాతా నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ రోజు సులభమైన రెసిపీ గురించి తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

తయారీకి కావలసిన పదార్థాలు

  1. వేరుశనగలు – 2 కప్పులు
  2. పాల పొడి – 2 టేబుల్ స్పూన్లు
  3. చక్కెర( పటిక బెల్లం) – 1 కప్పు లేదా రుచికి సరిపడా
  4. నీరు – 1/2 కప్పు
  5. నెయ్యి – 1/2 స్పూన్

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

వేరుశనగ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలంటే

  1. వేరుశెనగ బర్ఫీని చేయడానికి ముందు రెండు కప్పుల వేరుశెనగ గింజలు తీసుకోవాలి.
  2. ఇప్పుడు పాన్ ని గ్యాస్ మీద పెట్టి వేడి చేసి.. అందులో వేరుశెనగ గుళ్ళు వేసి, తక్కువ మంట మీద తేలికగా వేయించుకోవాలి.
  3. వేరుశెనగలు కరకరలాడేలా వేయించిన తర్వాత.. స్టవ్ మీద నుంచి దింపి వాటిని చల్లబరచండి.
  4. వేరుశెనగలు చల్లబడిన తర్వాత.. వాటి తొక్కను తొలగించడానికి ఒక గుడ్డతో రుద్దండి.
  5. ఇప్పుడు జల్లెడ సహాయంతో వేరుశెనగ పొట్టుని ఫిల్టర్ చేయండి.
  6. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని పొట్టు తీసిన వేరుశనగ పప్పుని వేసుకుని గ్రైండ్ చేయండి. మెత్తని పొడిగా మిక్సీ చేయండి..
  7. ఇప్పుడు ఈ వేరుశనగ పొడిని జల్లెడతో జల్లించండి.
  8. మెత్తగా ఉన్న వేరుశనగ పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల పాలపొడిని పొడిని వేసి బాగా కలపండి.
  9. ఇప్పుడు గ్యాస్ మీద పాన్ పెట్టుకోండి.. ఒక కప్పు చక్కెర, అర కప్పు నీరు వేసి షుగర్ సిరప్ తయారు చేసుకొండి.
  10. ఇప్పుడు గ్యాస్ ఆపేసి.. వేరుశెనగ పొడి మిశ్రమాన్ని వేసి బాగా కలపండి.
  11. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక టీస్పూన్ నెయ్యి వేసి ఒక నిమిషం పాటు తక్కువ మంట మీద ఈ వేరుశనగ మిశ్రమాన్ని వేయించండి.
  12. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని దానికి నెయ్యి రాసి వేరు శనగ మిశ్రమాన్ని వేయండి.
  13. ఇప్పుడు దాని మీద మరో బటర్ పేపర్ వేసి చపాతీలా మీడియం మందంలో వచ్చేలా రొట్టెలా చేయండి.
  14. ఇప్పుడు వేరుశెనగ బర్ఫీని చతురస్రాకారంలో కట్ చేయండి.. ఆపై వెండి కాగితం (సొలమ)తో అలంకరించండి.
  15. ఇప్పుడు వేరుశెనగ కట్లీని మీకు నచ్చిన ఆకారంలో కత్తిరించండి. అంతే టేస్టీ టేస్టీ పీనట్స్ కట్లీ రెడీ.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us