AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాఫీ తాగుతూ ఈ ఆహారాలు తింటున్నారా? మీరు ఆరోగ్యం షెడ్డుకే..

కాఫీ తాగుతూ ఏదోక ఆహరాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే కాఫీ తాగుతూ కొన్ని రకాల ఆహారపదార్ధాలను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కాఫీలోని పదార్థాలు ఆహారంలోని పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తాయి. మీరు కూడా కాఫీ ప్రియులైతే.. కాఫీ తాగుతూ కొన్ని రకాల ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. అవి ఏమిటి? వాటిని ఎందుకు తినకూడదో తెలుసుకుందాం..

కాఫీ తాగుతూ ఈ ఆహారాలు తింటున్నారా? మీరు ఆరోగ్యం షెడ్డుకే..
Health Tips
Surya Kala
|

Updated on: Sep 05, 2025 | 8:12 PM

Share

కాఫీని ఇష్టంగా దానిని ఆస్వాదిస్తూ త్రాగే వ్యక్తులు ఉంటారు. కొంతమంది సమయం గడపడానికి దీనిని తాగుతారు. ఉదయం లేదా సాయంత్రం అయినా ఒక కప్పు కాఫీ తాగితే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తారు. ఆఫీసులో అయినా.. ఇంట్లో లేదా విదేశాలలో అయినా చాలా మంది కాఫీ తాగకుండా రోజు గడవదని భావిస్తారు. మితంగా కాఫీ తాగడం మంచిది. పోషకాహార నిపుణులు కాఫీ తాగడానికి ముందు లేదా తరువాత కొన్ని ఆహారాలను ఖచ్చితంగా తీసుకోకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే కాఫీలోని కొన్ని అంశాలు ఆహారంలోని పోషకాలను గ్రహించడాన్ని నిరోధిస్తాయి. మీరు కూడా కాఫీ ప్రియులైతే కాఫీతో పాటు కొన్ని రకాల ఆహారాన్ని తీసుకోకూడదు. అవి ఏమిటంటే..

కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన పానీయం. దాదాపు ప్రతి ఇంట్లో కాఫీ ఉండాల్సిందే. కొంతమందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ పోషకాహార నిపుణులు చక్కెర లేదా పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగాలని సిఫార్సు చేస్తున్నారు. కాఫీ తాగే ముందు లేదా తర్వాత కొన్ని ఆహారాలు తినకూడదని కూడా హెచ్చరిస్తున్నారు.

సిట్రస్ పండ్లు ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లను కాఫీతో కలిపి తినకండి. అలా చేయడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

రెడ్ మీట్ కాఫీతో రెడ్ మీట్ తినవద్దు లేదా తిన్న తర్వాత కాఫీ తాగవద్దు. ఎందుకంటే ఈ పానీయం మాంసం జీర్ణం కావడాన్ని ఆలస్యం చేస్తుంది. కనుక రెడ్ మీట్, కాఫీ రెండింటినీ ఎప్పుడూ కలిపి తీసుకోవద్దు. అయితే, మీరు తాగవలసి వస్తే బ్లాక్ కాఫీ తాగవచ్చు. కానీ పాలతో కలిపి కాఫీ తాగవద్దు. ఎందుకంటే పాలతో కాఫీ తాగడం వల్ల పాలలోని కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది.

జంక్ ఫుడ్, వేయించిన ఆహారం స్నాక్స్, జంక్ ఫుడ్ లేదా వేయించిన ఆహారాలు తిన్న తర్వాత వెంటనే కాఫీ తాగవద్దు. ఇది అనవసరమైన కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.

తృణధాన్యాలు అలాగే, తృణధాన్యాలు తిన్న తర్వాత కాఫీ తాగడం మంచిది కాదు. ఇది తృణధాన్యాలలో ఉండే విటమిన్లు, ఖనిజాలను సరిగ్గా గ్రహించకుండా నిరోధిస్తుంది. కనుక కాఫీ తాగేటప్పుడు ఈ ఆహారాలను తినవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)